Site icon HashtagU Telugu

Health Benefits: ప్రొద్దుతిరుగుడు గింజలతో కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Mixcollage 14 Dec 2023 03 39 Pm 725

Mixcollage 14 Dec 2023 03 39 Pm 725

ప్రొద్దుతిరుగుడు గింజల గురించి మనందరికీ తెలిసిందే. వీటిని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. నల్ల విత్తనాలు, కుసాలు, టైం పాస్ అంటూ ఇలా ఒక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. వీటి వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తరచుగా తీసుకుంటూ ఉండటం వల్ల ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి కావలసిన ఇమ్యూనిటీ బలోపేతం చేస్తాయి. అలాంటి ఆహారాలలో పొద్దు తిరుగుడు గింజలు కూడా ప్రధానమైనవి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి ఈ పొద్దుతిరుగుడు గింజల వల్ల కలిగే ప్రయోజనాల విషయానికొస్తే..

పొద్దు తిరుగుడు గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంప్లమెటరీ లక్షణాలు ఉంటాయి. వీటిలో ఉండే లేవనాయిడ్స్, పాలి అండ్ స్యాచు రేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు గుండె జబ్బులు వచ్చే అవకాశాల్ని పూర్తిగా తగ్గిస్తాయి. నిత్యం పొద్దుతిరుగుడు గింజలను తీసుకోవడం వలన శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. పొద్దు తిరుగుడు గింజలలో విటమిన్ ఈ ఫ్లేవనాయుడు ఇతర వృక్ష సంబంధ సంబంధాలు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపుల్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. ఆర్థరైటిస్ లాంటి సమస్యలు ఉన్నవారికి కూడా పొద్దు తిరుగుడు గింజలతో చాలా మేలు జరుగుతుంది. పొద్దు తిరుగుడు గింజలను నిత్యం తీసుకోవడం వలన హై బీపీ కంట్రోల్ అవుతుంది.

అలాగే శరీర రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు వెంట్రుకలు, చర్మం సంరక్షణకు కలుగుతుంది. అలాగే ఎముకలు దృఢంగా ఉంటాయి. జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవాళ్లు రోజు పొద్దుతిరుగుడు గింజలను తీసుకోవడం వలన మంచి ఉపయోగం కలుగుతుంది. వీటిలో ఉండే ఎంజైమ్ లు మలబద్ధకం లాంటి సమస్య ను తగ్గిస్తాయి. ఈ గింజలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని వ్యర్ధాలను బయటికి పంపించడమే కాకుండా మెటబాలిజాన్ని కూడా పెంచుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చయి కొవ్వుని కరిగిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళు కచ్చితంగా పొద్దుతిరుగుడు గింజలను నిత్యం తీసుకుంటే ఉపయోగం ఉంటుంది.