Site icon HashtagU Telugu

Winter: చలికాలంలో బచ్చలి కూర తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Mixcollage 20 Dec 2023 05 30 Pm 732

Mixcollage 20 Dec 2023 05 30 Pm 732

మామూలుగా చలికాలంలో వాతావరణం చల్ల చల్లగా ఉంటుంది. దీంతో చాలామంది చలికి వేడివేడిగా ఏదైనా తినాలని అనుకుంటూ ఉంటారు. ఎక్కువ శాతం మంది మిర్చి బజ్జీలు, టీ లు, ఫ్రైడ్ రైస్ లు వంటివి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే శీతాకాలంలో ఇలా వేయించిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల త్వరగా బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే శీతాకాలంలో చాలామంది వ్యాయామం చేయడానికి బద్ధకిస్తారు. సోమరితనంతో శారీరక శ్రమ లేకపోవడం వలన ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి.

అయితే ఇటువంటి సమస్యలను తగ్గించుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. అందులో ముఖ్యంగా బచ్చలి కూర ఎక్కువగా తినడం వలన ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. బచ్చలి కూర అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది. చలికాలంలో బచ్చలి కూర తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో వచ్చే అనేక అనారోగ్య సమస్యల నుంచి కూడా రక్షిస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఉంటే ఆహారంలో బచ్చలి కూరను తీసుకోవడం వలన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరంలో ఐరన్ పొటాషియం లోపాన్ని సవరించడంలో బచ్చలి కూర బాగా ఉపయోగపడుతుంది.

బచ్చలి కూర మాత్రమే కాకుండా ఆహారంలో ఇతర ఆకుపచ్చ కూరలను కూడా చేర్చుకోవచ్చు. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు బచ్చలి కూరను తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. పాలకూరలో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల అది రక్తపోటు స్థాయిని సరిగ్గా ఉండేలా చేస్తుంది. అందుకే బచ్చలి కూరను తీసుకోవడం వలన గుండె సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. బచ్చలి కూరలో జియాక్సంతిన్, లూటిన్, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటాయి. కంటి ఆరోగ్యం చక్కగా ఉండాలంటే బచ్చలి కూరను తప్పనిసరిగా తినాలి. బచ్చలి కూరలో విటమిన్ కె, పొటాషియం, విటమిన్లు ఖనిజాలు ఉన్నాయి. రోజుకు ఒక కప్పు బచ్చల కూరను తింటే ఎముకలు బలంగా తయారవుతాయి.