Site icon HashtagU Telugu

Soaked Cashew: జీడిపప్పు నానబెట్టి తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Soaked Cashew

Soaked Cashew

డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన జీడిపప్పు గురించి దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. జీడిపప్పును ఎన్నో రకాల స్వీట్ల తయారీలో వంటకాల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. జీడిపప్పును ఉపయోగించి ప్రత్యేకంగా వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ జీడిపప్పును చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ప్రతిరోజు జీడిపప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరాతాయని చెబుతున్నారు. అయితే చాలా వరకు జీడిపప్పును నేరుగా తినడానికి లేదంటే స్వీట్లు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడైనా జీడిపప్పును నానబెట్టుకుని తిన్నారా. ఒకవేళ జీడిపప్పు నానబెట్టుకుని తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పోషకాలు ఎక్కువగా ఉండే జీడిపప్పు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. జీడిపప్పులో హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. నానబెట్టిన జీడిపప్పును రోజూ పరగడుపున తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుందని, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. అలాగే జీడిపప్పు కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో బాగా సహాయపడుతుందట. ఇది కంటి రెటినాను రక్షిస్తుందట. నానబెట్టిన జీడిపప్పులో ఉండే జియా క్సాంథిన్ వృద్ధులలో వయస్సు-సంబంధిత మాక్యులర్ క్షీణతను నివారించడానికి సహాయపడుతుంది. అందుకే కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి నానబెట్టిన జీడిపప్పుతో ఈరోజు ను మొదలు పెట్టాలని చెబుతున్నారు.

అలాగే నానబెట్టిన జీడిపప్పును తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందట. వీటిలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుందట. ఇది ప్రేగు కదలిక ప్రక్రియను సులభతరం చేస్తుందని, నానబెట్టిన జీడిపప్పు కూడా సులభంగా జీర్ణం అవుతుందని చెబుతున్నారు. అలాగే ఇది కడుపుకు సంబంధించిన సమస్యలను కూడా నివారిస్తుందట. ఇతర డ్రై ఫ్రూట్స్ తో పోలిస్తే జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు, పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. డయాబెటీస్ పేషెంట్లు కూడా ఈ జీడిపప్పును తినవచ్చట. ఇది శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను నార్మల్ గా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయట. ఇవి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంటాయి. చర్మ సంరక్షణలో జీడిపప్పు నూనెను కూడా చేర్చవచ్చని చెబుతున్నారు. ఇవి ఫైటోకెమికల్స్, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లకు గొప్ప వనరులు. దీన్ని ఉపయోగిస్తే మీ చర్మం కాంతివంతంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే జీడిపప్పులు తగినంత మెగ్నీషియం ఉంటుంది. ఇది హార్ట్ స్టోక్ వంటి ప్రమాదలను తగ్గిస్తుందట.