Site icon HashtagU Telugu

Health Benefits: కీవీ పండ్లను ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త?

Mixcollage 26 Dec 2023 05 57 Pm 163

Mixcollage 26 Dec 2023 05 57 Pm 163

కీవీ పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి తినడానికి కాస్త పుల్లగా తియ్యగా కూడా ఉంటాయి. ఈ మధ్యకాలంలో వీటి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొందరు వీటిని నేరుగా తింటే మరికొందరు జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు. కీవీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫెక్షన్ లక్షణాలు వంటి అనేక లక్షణాలు ఉంటాయి. అలాగే విటమిన్ సి, విటమిన్ బి6, ఫైబర్, పొటాషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్స్, రైబోఫ్లెవిన్, బీటా కెరోటిన్ వంటి విటమిన్లు, ఖనిజాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి.

కీవీలో ఉండే గుణాలు అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి. కానీ ఈ పండును ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. దీంతో అనేక సమస్యలకు దారితీస్తుంది. కీవీని అధిక మోతాదులో తీసుకుంటే ఎలర్జీ లాంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా దీనివల్ల చర్మంపై దద్దుర్లు, వాపులు, నోటి లోపల చికాకు, ఆస్తమా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీ రోగులు కివి పండ్లను ఎక్కువగా తినకూడదని సూచిస్తున్నారు. కీవీలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీ సంబంధిత వ్యాధులకు కారణం అవుతుంది. అందువల్ల కీవీని ఎక్కువగా తీసుకోకూడదు.

కీవీ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వలన నోటి అలర్జీ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఈ కారణంగా పెదవులు, నాలుక వాపు, నోటి లోపల పుండ్లు లాంటి సమస్యలు మొదలవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కీవీ పండు లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా డయోరియా సమస్యలు రావచ్చు. అంతేకాకుండా కొంతమందికి కడుపునొప్పి, వాంతులు, వికారం వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి. అందుకే కీవీ పండ్లను ఎక్కువగా తీసుకోకూడదు.