Site icon HashtagU Telugu

Saffron Tea: కుంకుమ పువ్వు టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే?

Mixcollage 27 Feb 2024 12 29 Pm 7585

Mixcollage 27 Feb 2024 12 29 Pm 7585

కుంకుమపువ్వు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది కేవలం ధర విషయంలో మాత్రమే కాకుండా వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల విషయంలో కూడా టాప్ అని చెప్పవచ్చు. దీని ధర కాస్త ఖాస్తు ఎక్కువే అయినప్పటికీ కుంకుమపువ్వు వల్ల కలిగే లాభాలు ఎన్నో. చాలామంది కుంకుమపువ్వుతో టీ కూడా చేసుకుని తాగుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరి కుంకుమపువ్వు టీ వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.. కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్, ఆంటీ ఇంప్లమెంటరీ వంటి సమ్మేళనాల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రశాంతతను అందిస్తాయి.

ఒత్తిడిని తగ్గిస్తాయి. పడుకునే ముందు ఈ టీ తాగితే ప్రశాంతంగా నిద్ర పడుతుంది పీరియడ్ సరిగ్గా రానివారు రెండు కుంకుమ పువ్వు రేకులని గోరు వెచ్చని నీటిలో వేసుకొని ఆ నీటిని తాగినట్లయితే నెలసరి సక్రమంగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రాత్రి సమయంలో కుంకుమ 2 పువ్వు టీ తాగితే ముఖంపై మొటిమలు, మచ్చలు వృద్ధాప్య ఛాయలు అన్ని తగ్గిపోతాయి. చర్మానికి మృదుత్వాన్ని అందిస్తుంది. అదేవిధంగా కుంకుమపువ్వు టీ తాగడం వలన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.

ఈ సమయంలో బ్లడ్ లో చక్కెర లెవెల్ స్థిరంగా ఉంటే మంచి నిద్ర పడుతుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. రాత్రి సమయంలో ఈ కుంకుమపువ్వు టీ తాగితే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. నాణ్యమైన నిద్రను ప్రోత్సహిస్తుంది. నిద్రలేమి తో ఇబ్బంది పడే వారికి ఈ టీ చాలా బాగా మేలు చేస్తుంది. కంటి నిండా నిద్ర పట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.