Saffron: కుంకుమ పువ్వుతో పురుషులలో అలాంటి సమస్యలకు చెక్.. అవేంటో తెలుసా?

కుంకుమ పువ్వు.. కశ్మీర్ లాంటి ప్రదేశాలలో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. భారతీయులు ఈ కుంకుమ పువ్వును

  • Written By:
  • Publish Date - March 30, 2023 / 06:00 AM IST

కుంకుమ పువ్వు.. కశ్మీర్ లాంటి ప్రదేశాలలో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. భారతీయులు ఈ కుంకుమ పువ్వును ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. కుంకుమపువ్వు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి మన అందరికి తెలిసిందే. స్త్రీలతో పాటు పిల్లలకు కూడా కలిపి ఇస్తూ ఉంటారు. గర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల పుట్టే పిల్లలు అందంగా ఆరోగ్యంగా పడతారని తీసుకుంటూ ఉంటారు. అలాగే పిల్లలు కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని పిల్లలకు పాలలో కలిపి తాగిస్తూ ఉంటారు.

కుంకుమపువ్వు ను సుగంధద్రవ్యాల తయారీ, పర్ ఫ్యూమ్, మెడిసిన్, సబ్బులు, ఆహార పదార్థాల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇందులో ఎన్నో పోషకవిలువలు ఉన్నాయి. అందుకే దీని ధర ఎక్కవగా ఉంటుంది. కుంకుమపువ్వు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కుంకుమపువ్వు కేజీ లక్షల్లో ఉంటుందని చెప్పవచ్చు. ఇందులో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి అనేక పోషక విలువలు మెండుగా ఉంటాయి. తరచుగా కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే శరీరం ఫిట్‌గా ఉంటుంది. ఇది మగవారికి దేవుడిచ్చిన వరం లాంటిది.

మగవారికి అనేక సమస్యలను దూరం చేస్తుంది. కుంకుమ పువ్వు తీసుకుంటే పురుషుల శారీరక బలహీనత తొలగి కండరాలు దృఢంగా మారుతాయి. కుంకుమపువ్వు తీసుకుంటే మగవారిలో శీఘ్రస్కలన సమస్య నుంచి బయట పడవచ్చు. చాలా మంది మగవారిలో మానసిక ఒత్తిడి వలన ఈ సమస్య వేధిస్తుంది. అటువంటి వారికి కుంకుమ పువ్వు నిజంగానే సంజీవనిలా పని చేస్తుంది. దీంతో శృంగార సమయంలో త్వరగా వీర్యం విడుదల కాకుండా ఉంటుంది. అంతేకాకుండా లైంగిక కోరికలు కూడా పెరుగుతాయి. ఒత్తిడి, నిద్రలేమి, సరైన ఆహారం తీసుకోకపోవడం, రేడియేషన్ వలన పురుషుల్లో వీర్యకణాల కౌంట్ తగ్గుతుంది. అటువంటి వారు కుంకుమ పువ్వు తీసుకుంటే వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది.