Site icon HashtagU Telugu

Sabudana: వేసవిలో సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?

Sabudana Benefits

Sabudana

సగ్గుబియ్యం.. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేది సగ్గుబియ్యం గంజి, సగ్గుబియ్యం పాయసం. సగ్గుబియ్యం పాయసం లేదా సగ్గుబియ్యంతో తయారుచేసిన పదార్థాలు తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. మరీ ముఖ్యంగా సగ్గుబియ్యాన్ని వేసవికాలంలో తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వేసవిలో సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల అవి శరీరాన్ని చల్లబరుస్తుంది. సగ్గుబియ్యంతో ఏది చేసుకున్నా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. లావు సగ్గుబియ్యం అయితే రాత్రి పూటే నానబెట్టి ఉదయాన్నే అదే నీళ్లతో ఉడికించి కాస్త బెల్లం కలిపి తీసుకుంటే చలువ చేస్తుంది.

పాలల్లో వేసి పాయసంలా కూడా కలిపి తీసుకోవచ్చు. తీపి కోసం చక్కెర బదులు పటికబెల్లం కానీ, బెల్లం కానీ ఉపయోగిస్తే మంచిది. సాబుదాన లేదా సగ్గుబియ్యం కిచిడీ కూడా తరచూ చేసుకుని తింటూ ఉంటే వేసవి తాపం నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఉత్తమ వేసవి శీతలీకరణిగా సగ్గుబియ్యం అద్బుతంగా పని చేస్తాయి. వేడి పెరిగేకొద్దీ జీర్ణవ్యవస్థ బలహీనంగా మారుతుంది. ఇది అనేక జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. సీజన్ లో మార్పు వచ్చినప్పుడు శరీరం భిన్నంగా స్పందిస్తుంది.

డీహైడ్రేషన్, హీట్ ఎగ్జాషన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు, నోటి పూత, స్ట్రోక్, ఫుడ్ పాయిజనింగ్, ఆకలి తగ్గడం వంటివి ఎండాకాలంలో సాధారణ సమస్యలు. శరీరంలో శీతలీకరణ లక్షణాలను కలిగి ఉన్న ఆహార పదార్థాలను చేర్చడం చాలా ముఖ్యం. శీతలీకరణ ఆహార పదార్థాలు మన జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయి. గ్గుబియ్యంలో ప్రొటీన్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీనితో పాటు క్యాలరీల పరిమాణం కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇవి ఎముకలను బలోపేతం చేయడంతో పాటు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.

Exit mobile version