Site icon HashtagU Telugu

Immunity: ఇమ్యూనిటీని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ గింజలు తీసుకోవాల్సిందే?

Mixcollage 07 Feb 2024 01 37 Pm 7533

Mixcollage 07 Feb 2024 01 37 Pm 7533

కరోనా మహమ్మారి తర్వాతప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం పై పూర్తి జాగ్రత్తలు వహిస్తున్నారు. అంతేకాకుండా ఆరోగ్యం విషయంలో స్పెషల్ కేర్ కూడా తీసుకుంటున్నారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒంట్లో రోగ నిరోధక శక్తి తక్కువ కాకుండా చూసుకుంటున్నారు. ఇక ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సరైన విధంగా ఆహార పదార్థాలు కాయగూరలు తీసుకోవడంతో పాటు కొన్నిరకాల ఆహార పదార్థాలను మన డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవచ్చు. ఒంట్లో రోగనిరోధక శక్తి తక్కువైతే కరోనా లాంటి వైరస్ ను శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఒక్క కరోనా వైరస్ అని మాత్రమే కాకుండా సీజన్ల ప్రకారంగా వచ్చే వైరస్ ల బారిన పడకుండా ఉండవచ్చు.

అయితే బాడీలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవాలని అనుకున్న వారు తీసుకోవాల్సిన వాటిలో సబ్జా గింజలు కూడా ఒకటి. ఇందుకు సబ్జా గింజలు చాలా ఉత్తమంగా పనిచేస్తాయి. సబ్జా గింజల్లో చాలా పోషకాలు ఉంటాయి. వీటిలో ఉండే బీటా కెరోటిన్, వైసెనిన్, ఓరింటిన్ లాంటి ఫ్లేవనాయిడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సబ్జా గింజల్లో ఉన్నన్ని ఔషధ గుణాలు మరే గింజల్లో ఉండవు. ఇవి చూడటానికి చిన్నగా నల్లగా ఉన్నా వీటిని నీటిలో వేసి నానబెడితే తెల్లగా మారుతాయి. ముఖ్యంగా ఒంట్లో వేడి ఎక్కువైతే శరీరంలో ఉన్న వేడిని సబ్జా గింజలు ఇట్టే తగ్గించేస్తాయి. అలాగే మీకు తలనొప్పి వచ్చినా ఒంట్లో నీరసంగా ఉన్నా కొన్ని సబ్జా గింజలను తీసుకొని వాటిని నీళ్లలో కలుపుకొని తాగడం మంచిది.

సబ్జా గింజల్లో ఉండే మరో మంచి గుణం ఏంటంటే.. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అలాగే శరీరంలో ఉన్న మలినాలను ఇవి తొలగించేస్తాయి. మలబద్ధక సమస్యలు ఉన్నా కూడా వీటిని రాత్రి పూట పాలల్లో కలుపుకొని తాగితే మలబద్ధక సమస్య వెంటనే తగ్గుతుంది. సబ్జా గింజలు షుగర్ ను కంట్రోల్ లో ఉంచేందుకు మంచి ఔషధంలా పనిచేస్తాయి. వారంలో ఒకరోజు సబ్జా గింజలతో చేసిన జ్యూస్ తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది. బాడీలో షుగర్ లేవల్స్ ను పెరగకుండా ఇవి అదుపులో ఉంచుతాయి. అందుకే షుగర్ పేషెంట్లు సబ్జా గింజలతో చేసిన జ్యూస్ ను అప్పుడప్పుడు తాగుతుండాలి. అయితే చిన్న పిల్లలకు సబ్జా గింజలతో చేసిన పానీయాలను తాగించకపోవడం మంచిది. ఎందుకంటే పిల్లలకు ఈ గింజలు సరిగ్గా అరగవు. ఒకవేళ గింజలు పడకపోతే వాళ్లకు శ్వాసకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. గర్భిణులు కూడా సబ్జా గింజలను తినకపోవడమే మంచిది. గర్భిణుల్లో ఈస్ట్రోజోన్ లేవల్స్ ను పూర్తిగా తగ్గిస్తాయి. అందుకే గర్భిణులు సబ్జా గింజలకు దూరంగా ఉండటం మంచిది.