Rosy Health: గులాబీ రేకులతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

గులాబీ పువ్వులు చూడడానికి ఎంతో అందంగా ముద్దుగా ఉంటాయి. అమ్మాయిలు అయితే గులాబీ పూలను ఇష్టపడుతూ

  • Written By:
  • Updated On - September 20, 2022 / 10:05 PM IST

గులాబీ పువ్వులు చూడడానికి ఎంతో అందంగా ముద్దుగా ఉంటాయి. అమ్మాయిలు అయితే గులాబీ పూలను ఇష్టపడుతూ ఉంటారు. ఈ గులాబీ పూలను అలంకరణకు, అలాగే దేవుళ్లకు, చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. గులాబీ పూలతో తయారైన రోజ్ ఆయిల్,రోజ్ వాటర్ లాంటివి చర్మ సౌందర్యానికి ఉపయోగిస్తూ ఉంటారు. చర్మ సౌందర్యానికి గులాబీలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా ఎప్పటినుంచో ఈ గులాబీ పూలను వైద్యంలో కూడా ఉపయోగిస్తూ ఉన్నారు.

అయితే గులాబీ పువ్వులలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మన గులాబీ పువ్వు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం.. గులాబీలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, బరువు తగ్గించడంలో గులాబీలు సహాయపడతాయి. అదేవిధంగా పైల్స్‌తో పోరాడటానికి గులాబీ రేకులు సహాయపడతాయట. అయితే గులాబీ రేకులు జీర్ణక్రియను మెరుగుపరిచి, ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుందట. గులాబీ రేకులకు, డెజెస్టివ్‌ ప్రాపర్టీస్‌ ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే గులాబీ రేకులు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

రోజ్‌ టీ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఒక మంచి ఔషదంలా పనిచేస్తుంది. త్వరగా బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ చాలా ముఖ్యం. రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల రోజ్‌ టీ తాగితే త్వరగా బరువు తగ్గుతారు. గులాబీ పువ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం నిస్తేజంగా ఉండటం, పొడిబారడం వంటి సమస్యలను చిటికెలో దూరం చేసుకోవచ్చు. రోజా పువ్వు రేకులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై ఏర్పడే మొటిమలను, ఎర్రగా మారిన చర్మానికి నయం చేయడానికి సహాయపడుతాయి.
రోజా పూలలోని ఔషధ గుణాలు దురద, తామర వంటి చర్మ సమస్యలు నివారించడానికి చక్కగా పనిచేస్తాయి.

గులాబీ రేకుల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేయడంలో సహాయపడతాయి. శరీరంలోని సెల్యులార్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. రోజ్‌షిప్ సారం కడుపు మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. గులాబీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గులాబీ రేకుల‌తో త‌యారు చేసిన డ్రింక్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి, ఒత్తిడి, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి