Red lady finger: ఎర్రటి బెండకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?

బెండకాయ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బెండకాయలు విటమిన్ సి లభిస్తుంది. ఈ బెండకాయలలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటా

  • Written By:
  • Publish Date - August 10, 2023 / 10:30 PM IST

బెండకాయ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బెండకాయలు విటమిన్ సి లభిస్తుంది. ఈ బెండకాయలలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. అలాగే బెండకాయలు తింటే తెలివితేటలు కూడా బాగా పెరుగుతాయి. చాలామంది బెండకాయను ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే బెండకాయను తినడం ఆరోగ్యానికి మంచిదే అలాగే కొన్ని రకాల సమస్యలు కూడా దూరం అవుతాయి అంటున్నారు మన వైద్య నిపుణులు. మార్కెట్ లో రెండు రకాల బెండకాయలు మనకు లభిస్తూ ఉంటాయి. ఒకటి పచ్చ రకం బండకాయలు రెండవది ఎరుపు బెండకాయలు.

ఎరుపు రంగు బెండకాయల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణ బెండకాయలో స్వల్పంగా పిండి పదార్థాలు, ప్రొటీన్లు ,విటమిన్ ఎ, విటమిన్‌ బి1, బి2, బి3, బి9, విటమిన్‌–సి, విటమిన్‌ ఇ, విటమిన్‌ కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్‌ వంటి మినరల్స్‌ ఉంటాయి. ఇది తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ ఎర్ర బెండకాయ తింటే గుండెకు మంచిది. ఎర్ర బెండకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాశీ బెండలో కేలరీలు, పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు, ఫైబర్, మెగ్నీషియం ఉంటాయి. ఇవే కాకుండా, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి.

ఈ వెరైటీ బెండలో కేలరీలు, పిండి పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. మీ హెల్త్‌ను కాపాడుకోవడానికి ఎర్ర బెండకాయను మీ డైట్‌లో చేర్చుకోవడం మంచిది. దీనిలో సోడియం తక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎర్ర బెండకాయలో దాదాపు 94 శాతం పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎర్రటి బెండకాయలో 21 శాతం ఐరన్, 5 శాతం ప్రొటీన్లు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పెంచడానికి సహాయపడతాయి.
జీవక్రియ మెరుగుపడుతుంది. శ్వాస, జీర్ణక్రియ వంటి ముఖ్యమైన పనులకు శక్తిని అందించడానికి జీవక్రియ అవసరం. జీవక్రియ మెరుగ్గా ఉండే.. ఆరోగ్యంగా ఉంటాం. ఎర్ర బెండకాయలో ఉండే ఐరన్, ప్రోటీన్ జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.