మన వంటింట్లో దొరికే కాయగూరలలో ముల్లంగి కూడా ఒకటి. దీని వాసన ఘాటుగా ఉండడంతో పాటు తింటే కారంగా కూడా ఉంటుంది. చాలావరకు ముల్లంగిని పచ్చిగా తినడానికి ఎవరు ఇష్టపడరు. ఉపయోగించి ఎన్నో రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ముల్లంగి ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అలాగే ఎన్నో రకాల సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. అయితే కేవలం ముల్లంగి వల్ల మాత్రమే కాకుండా ముల్లంగి ఆకుల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. ముల్లంగి ఆకులలో విటమిన్లు ఎ, సి, కె, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అవసరమైన పోషకాలు వీటిలో పుష్కలంగా ఉన్నాయి.
బరువు తగ్గడం నుంచి రక్తహీనత సమస్యల వరకు చర్మ పునరుజ్జీవనానికి కూడా ముల్లంగి ఆకులు సహాయపడతాయట. ముల్లంగి ఆకుల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అలాగే శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ లతో పోరాడడంలో సహాయపడతాయి. అధిక స్థాయి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరిస్తాయట. కాలానుగుణ జలుబు, ఫ్లూ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని చెబుతున్నారు. కాగా ముల్లంగి ఆకులు సహజ మూత్ర విసర్జనగా పని.చేస్తాయి. మూత్ర పిండాల నుండి అదనపు నీరు, టాక్సిన్స్ బయటకు వెళ్లడానికి సహాయపడతాయి. ముల్లంగి ఆకులతో చేసే జ్యూస్ తాగడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు, కిడ్నీ స్టోన్ ఏర్పడకుండా నివారిస్తుందట. మరి ముఖ్యంగా చలికాలంలో నీటి వినియోగం తక్కువగా ఉన్నప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గడం ముల్లంగి ఆకులు జీవక్రియ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది.
అంతే కాకుండా 100 గ్రాముల ముల్లంగి ఆకులో 13 కేలరీలు ఉంటాయి. చక్కెర స్థాయి 1.2 గ్రాములు, ఫైబర్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ బరువు తగ్గడానికి ఉపయోగపడతాయట. బరువు తగ్గాలని ప్రయత్నించే వారు ముల్లంగి ఆకుకూరలను బ్రేక్‌ఫాస్ట్ లో తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే ముల్లంగి ఆకుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందట. ఫలితంగా రక్తహీనతతో బాధ పడేవారికి ముల్లంగి ఆకులు ఎంతో మేలు చేస్తాయట. ముల్లంగి ఆకులో మల్లంగి కంటే ఎక్కువ విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుందట. శరీరానికి సాధారణ వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని ఇస్తుంది. చర్మ ఆరోగ్యం ముల్లంగి ఆకుల్లోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది వయస్సుతో పాటు చర్మం కుంగిపోయే ధోరణిని తగ్గిస్తుంది. ముల్లంగి ఆకుకూరలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం ముడతలు తగ్గి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందట. ముల్లంగి ఆకులలో కాల్షియం, పొటాషియం, విటమిన్ లు ఉన్నాయి. ఇవి ఎముక సాంద్రతను నిర్వహించడానికి, బోలు ఎముకల వ్యాధి వంటి ఎముక వ్యాధులను నివారించడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయట. వీటిని వింటర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎముకల బలహీనత తగ్గుతుందట. ముల్లంగి ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి దూరంగా ఉంచుతాయి. శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరిగితే, గుండె జబ్బులతో సహా వివిధ వ్యాధులు అభివృద్ధి చెందుతాయి.