Pink Salt: పింక్ సాల్ట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

ఈ మధ్యకాలంలో మనకు మార్కెట్ లోకి పింక్ సాల్ట్ అనేది వచ్చిన విషయం తెలిసిందే. సాధారణంగా చాలామంది రాళ్ళ

  • Written By:
  • Publish Date - November 30, 2022 / 07:00 AM IST

ఈ మధ్యకాలంలో మనకు మార్కెట్ లోకి పింక్ సాల్ట్ అనేది వచ్చిన విషయం తెలిసిందే. సాధారణంగా చాలామంది రాళ్ళ ఉప్పు, నైస్ ఉప్పు అని ఈ రెండు రకాల ఉప్పులను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ చాలామందికి ఈ పింక్ సాల్ట్ గురించి తెలియదు. ప్రస్తుత రోజుల్లో చాలా వరకు ఈ పింక్ సాల్ట్ ని ఎక్కువగా ఉపయోగించడం మొదలుపెట్టారు. పింక్ సాల్ట్ ని తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మార్కెట్లో దొరికే ఈ పింక్ సాల్ట్ అచ్చం రాళ్లు ఉప్పు లాగే ఉంటుంది కాకపోతే లేత గులాబీ రంగులో కనిపిస్తుంది. సాధారణ ఉప్పుతో పోల్చుకుంటే ఈ పింక్ సాల్ట్ లో ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది.

అయితే అ ఉప్పు రంగులో ఉండటం వల్ల చాలామంది పింక్ సాల్ట్ అని పిలుస్తారు. మార్కెట్లో దొరికే ఈ పింక్ సాల్ట్ మనకు ఎక్కువగా హిమాలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా లబ్యమవుతుంది. అయితే చాలామంది సాధారణ ఉప్పుతో పోలిస్తే పింక్ సాల్ట్ లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని అనుకుంటూ ఉంటారు. కానీ సాధారణ ఉప్పుతో పోలిస్తే పింక్ సాల్ట్ లో సోడియం కాస్త తక్కువగానే ఉంటుంది. అందుకే చాలా వరకు నగరాలలో పెరిగేవాళ్లు సూప్ లు సలాడ్స్ వంటి వాటిలో భాగం చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా సాధారణ ఉప్పుతో పోల్చుకుంటే ఈ పింక్ సాల్ట్ లో 98% సోడియం క్లోరైడ్ ఉంటుంది. అలాగే పొటాషియం మెగ్నీషియం, క్యాల్షియం వంటి మొదలైనవి తక్కువ మోతాదులో లభిస్తాయి.

పింక్ సాల్ట్ నారింజ రంగులో కనిపించడానికి గల కారణం కూడా ఇదే. పింక్ సాల్ట్ శరీరంలోనించి చెడు పదార్ధాలని తొలగించి, నీటి శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది. వేసవి పానీయాలలో కూడా ఈ సాల్ట్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి శరీరంలోని సోడియం స్థాయిలని అదుపుచేసి వేసవిలో అతిదాహం కాకుండా చేస్తాయి. రక్తపోటుని నియంత్రించడానికీ, హార్మోన్ల స్థాయిలను సమతూకంలో ఉంచడానికీ, అరుగుదలకీ పింక్ సాల్ట్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది.