Site icon HashtagU Telugu

Benefits of Pears : క్యాన్సర్ నుంచి రక్షించే పియర్స్.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

benefits of pears

benefits of pears

Benefits of Pears : ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్ కు అలవాటు పడిపోయి.. పండ్లకు ఆమడదూరంలో ఉంటున్నారు ప్రజలు. ఫలితంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. బీపీ, షుగర్ వంటి వ్యాధులు త్వరగా వచ్చేస్తున్నాయి. వాటి బారిన పడకుండా ఉండాలంటే రోజూ పండ్లు తినాలి. ప్రతిరోజూ తినాల్సిన పండ్లలో పియర్స్ కూడా ఒకటి. వీటిని తెలుగులో బేరిపండ్లు అంటారు. యాపిల్ కంటే వీటిలో ఎక్కువ నీరు ఉంటుంది. తియ్యగా కూడా ఉంటుంది. వీటిలో ఫైబర్, ఇతర పోషకాలు కూడా ఉంటాయి. బరువు పెరగరు. పైగా క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

100 గ్రాముల పియర్స్ పండులో 57 కేలరీలు, 15 గ్రాముల పిండి పదార్థం, 0.1 గ్రాముల ఫ్యాట్, 0.4 గ్రాముల ప్రొటీన్, 3.1 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటాయి. వీటిని మందుల తయారీలో కూడా వాడుతారు. పియర్స్ పండ్లలో ఉండే విటమిన్ ఎ.. చర్మం, జుట్టు, గోర్లకు మేలు చేస్తుంది. రోజూ ఒకటి లేదా రెండు పియర్స్ పండ్లు తింటే చర్మంపై ముడతలు పోతాయి.

పియర్స్ లో రాగి, కాల్షియం, పాస్ఫరస్, మాంగనీస్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి శరీరంలోని ఎముకలను గట్టిగా చేస్తాయి. గొంతు గరగరగా ఉన్నప్పుడు పియర్స్ పండ్లు తింటే.. త్వరగా తగ్గిపోతుంది. శరీరంలో వేడిని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఎర్రరక్తకణాల సంఖ్య పెరుగుతుంది. కాలిన, తెగిన గాయాలను త్వరగా నయం చేస్తుంది. పియర్స్.. గుండెకు చాలా మంచిదని పలు అధ్యయనాల్లో ప్రూవ్ అయింది. ఇమ్యూనిటీని పెంచుతుంది.

భయంకరమైన క్యాన్సర్ బారిన పడకుండా పియర్స్ పండ్లు కాపాడుతాయి. ఇవి యాంటీ-కార్సినోజెనిక్ ప్రక్రియ చేపడుతాయి. మృతకణాలను తొలగించి.. కొత్త కణాలను అభివృద్ధి చేస్తాయి. డయాబెటీస్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. 5 వారాలపాటు పియర్స్ పండ్లు తిన్న 2 లక్షల మందిని టెస్ట్ చేయగా.. టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం 23 శాతం తక్కువగా ఉన్నట్లు తేలింది. వీటిలో ఉండే ఫైబర్.. పొట్టలో పేగుల్ని క్లియర్ చేస్తుంది. ప్రెగ్నెసీ ఉన్నవారు కూడా పియర్స్ పండ్లను తినొచ్చు.