Site icon HashtagU Telugu

Benefits Of Peanuts in Winter: చలికాలంలో వీటిని గుప్పెడు తింటే చాలు.. శరీరం వెచ్చగా ఉండడంతోపాటు?

L

L

వేరుశనగలు లేదా పల్లీలు వీటిని ఒక్కో ఒక ప్రదేశంలో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. పల్లీల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పల్లీలలో కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిల్లో ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చలికాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా వీటిని తినడం వల్ల చలికాలంలో రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది.

రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు వేరుశెనగలు సహాయపడతాయి. అలాగే శీతాకాలంలో అల్సామి సమస్య కూడా పెరుగుతుంది. అలసిపోయినట్లు అనిపించడం, నిద్రమత్తుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణ శక్తి కోసం కాసిన్ని వేరుశెనగ పలుకులు తింటే సరి పోతుంది. అంతే కాకుండా శరీరంలో ప్రొటీన్ల లోపాన్ని కూడా ఇవి భర్తీ చేస్తాయి.
శీతాకాలంలో వేరుశనగలు తినడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. చలికాలంలో ప్రతిరోజూ ఈ గింజలు తింటే శరీరం వెచ్చగా ఉంటుంది. ఈ గింజలు ఎముకలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడతాయి. ఇందులో ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి.

ఈ ఖనిజాలు ఎముకలను బలోపేతం చేస్తాయి. ఇవి చలికాలపు అలసట నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. వేరుశెనగలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి పల్లీలను చలికాలంలో తినడం ఎంతో మంచిది. కొందరు ఒట్టి పల్లీలను తినడానికి ఇష్టపడితే మరి కొందరు పచ్చి పల్లిలను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే పచ్చి పల్లీలు తినాలి అనుకున్న వారు రాత్రి సమయంలో నీటిలో కొన్ని పల్లీలను నానబెట్టి వాటిని పొద్దున్నే తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

Exit mobile version