Papaya Seeds: బొప్పాయిలో మాత్రమే కాదండోయ్ గింజల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు?

బొప్పాయి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. బొప్పాయిలో విటమిన్

  • Written By:
  • Publish Date - December 3, 2022 / 06:30 AM IST

బొప్పాయి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. బొప్పాయిలో విటమిన్ ఏ,బి,సి,ఈ, కాల్షియం,జింక్, మెగ్నీషియం, పొటాషియం, ఆంటీ యాక్సిడెంట్ , ఫైబర్ ఇలా ఎన్నో రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. బొప్పాయిలో ఉండే విటమిన్ ఏ పుష్కలంగా కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే బొప్పాయిలో ఉండే పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ గుండె కు అందించిన సమస్యలను దూరం చేస్తాయి. చాలామంది బొప్పాయిని తిని అందులో ఉండే గింజలను పారేస్తూ ఉంటారు. కానీ కేవలం బొప్పాయి మాత్రమే కాకుండా బొప్పాయి గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం చాలా మందికి తెలియదు.

అయితే బొప్పాయి గింజలను తీసుకోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు దూరం అవుతాయి అంటున్నారు. బొప్పాయి గింజల్లో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. బొప్పాయి గింజలు తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బొప్పాయి పండు డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో బాగా పనిచేస్తుంది అన్న విషయం తెలిసిందే. అలాగే బొప్పాయి గింజలు కూడా డయాబెటిస్ ను కంట్రోల్ చేయడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. బొప్పాయి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉండి అది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.

అలాగే బొప్పాయి గింజలను మన డైట్ లో భాగంగా చేర్చుకోవడం మంచిది. బొప్పాయి గింజల్లో ఉండే ఫైబర్ అధిక బరువు సమస్యను దూరం చేస్తుంది. బొప్పాయి గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌ ఉంటాయి. ఈ గింజలను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు కరుగుతాయి. అలాగే ఇన్ఫెక్షన్లను దూరం చేయడానికి కూడా బొప్పాయి గింజలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. బొప్పాయి గింజలు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే బొప్పాయి గింజలు అనేక రకాల ఫంగల్‌, ప్యారసైట్‌ లను నిర్వీర్యం చేస్తాయి.ఈ గింజలు అపెండిక్స్ చికిత్సలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా బొప్పాయి గింజలు కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ గింజల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి కిడ్నీలకు హాని చేసే ఆక్సిడేషన్‌ ఒత్తిడిని తొలగిస్తుంది.