మాములుగా వేసవి కాలంలో మనకు చాలా రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి. వాటిలో తాటి ముంజలు కూడా ఒకటి. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటూ ఉంటారు. లేత తాటి ముంజలు ఇష్టపడని వారు ఉండరు. ఈ లేత తాటి ముంజల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇవి ఎంతో రుచిగా ఉండడంతో పాటు ఎన్నో రకాల లాభాలను కూడా కలిగిస్తాయి.
మరి ముఖ్యంగా వేసవికాలంలో లభించే వీటిని తినడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. తాటి ముంజలు కేవలం వేసవికాలంలో మాత్రమే లభిస్తూ ఉంటాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రోటీన్లు కూడా కలిగి ఉంటాయి. తాటి ముంజల్లో విటమిన్లు విరివిగా ఉంటాయి. విటమిన్ ఎ అధికశాతంలో ఉంటుంది. విటమన్ బి, సి, జింక్, ఐరన్, పాస్ఫరస్, పొటాషియం వంటి విలువైన పోషకాలు ఉంటాయి. శరీరంలోని వ్యర్థాలన్నింటిని కూడా ముంజలు బయటకు పంపేస్తాయి. మలబద్దకాన్ని కూడా తరమికొడతాయి. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుందట.
శరీరాన్ని చల్లపరిచే గుణం ఉండంటంతో జనాలు వీటిని తినేందుకు చాలా ఇష్టం చూపిస్తారు. అలాగే మొటిమలు తగ్గించడానికి, అజీర్తి, ఎసిడిటీ సమస్యలు నిర్మూలనలో కూడా ముంజలు చాలా హెల్ప్ చేస్తాయి. గర్భిణులకు కూడా మంచి బలాన్ని ఇస్తాయి. చాలామంది ముంజలకు చుట్టూ ఉండే పొట్టు తీసి తింటారు. వాస్తవానికి ఆ పొట్టుతోనే ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వీటిని నేరుగా తినడం లేదంటే జ్యూస్ వంటివి చేసుకొని తాగడం వల్ల కూడా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి తప్పకుండా వేసవిలో దొరికే తాటి ముంజలను తప్పనిసరిగా తినాలని చెబుతున్నారు.