Diabetes: ఉల్లిపాయతో షుగర్ వ్యాధికి చెక్ పెట్టవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

ప్రస్తుత రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి పదిమందిలో ఐదు మంది ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతు

  • Written By:
  • Publish Date - December 27, 2023 / 03:00 PM IST

ప్రస్తుత రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి పదిమందిలో ఐదు మంది ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిస్ రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అయితే ఈ డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా కూడా సంకోచిస్తూ ఉంటారు. రక్తంలో షుగర్ పెరుగుతుందని భయపడుతూ ఉంటారు. అందుకే డయాబెటిస్ పేషెంట్లను వైద్యులు కూడా ఎక్కువగా ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు తీసుకోమని చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో ఉల్లిపాయ కూడా ఒకటి.

మామూలుగా ఉల్లిపాయ లేనిదే చాలా రకాల వంటకాలు అసలు రెడీ కావు. ఇద్దరు ఉల్లిపాయని నేరుగా తింటే మరి కొందరు కూరల్లో తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.. ఉల్లిపాయ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉల్లిపాయ ఒక ఔషధంగా పనిచేస్తుంది. ఉల్లిపాయ రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో ఉండే సల్ఫర్ క్యాన్సర్ వంటి రోగాలను రాకుండా చేస్తుంది. మూత్ర సంబంధిత వ్యాధులను నియంత్రిస్తుంది. ఉల్లిపాయలోని లక్షణాలు రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది.

అలాగే దంతాల్లో ఉండే ఇన్ఫెక్షన్ నివారించడానికి ఉల్లిపాయ సహాయపడుతుంది. పచ్చి ఉల్లిపాయను తింటే నోటిలో ఉండే కీటకాలు, క్రిములు చనిపోతాయి. ఉల్లిపాయ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో రక్త పోటును నివారిస్తుంది. ఉల్లిపాయ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే ప్రతిరోజు ఉల్లిపాయలను తినాలి. రోజు ఉల్లిపాయ తింటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ రోగులకు ఇచ్చే యాంటీ డయాబెటిక్ డ్రగ్ మెంట్ ఫార్మిన్ తో పాటు ఉల్లిపాయ కూడా తీసుకుంటే షుగర్ లెవెల్స్ 50 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది.