Site icon HashtagU Telugu

Health Benefits: బెండకాయ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే?

Mixcollage 11 Dec 2023 04 41 Pm 9703

Mixcollage 11 Dec 2023 04 41 Pm 9703

మన వంటింట్లో దొరికే కూరగాయలలో బెండకాయ కూడా ఒకటి. బెండకాయను ఎన్నో రకాల వంటకాలలో ఉపయోగిస్తూ ఉంటాం. అంతేకాకుండా ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగించే కూరగాయలలో బెండకాయ కూడా ఒకటి. బెండకాయను లేడీస్ ఫింగర్ లేదా ఓక్రా అని కూడా అంటారు. ఇంకా చాలామంది బెండకాయ తినడానికి ఇష్టపడితే ఇంకొందరు బెండకాయని తినరు. కానీ బెండకాయ వలన ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఈ బెండకాయలు కణాల ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది. దానివల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

బెండకాయలు ఎక్కువ మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిస్తుంది. దీనిలో అధిక మొత్తంలో విటమిన్ కె, పొలైట్ ఐరన్ ఉంటాయి. ఇది ఆరోగ్యాన్ని పెంచడానికి అదేవిధంగా రక్తహీనత సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వ్యక్తులు బెండకాయ ఒక మంచి ఆహారం అని చెప్పుకోవచ్చు. అధిక పైబర్ కంటెంట్ ఉన్నందున బెండకాయ కూరతో కొద్దిగా అన్నం తిన్న కడుపు నిండిన భావన ఉంటుంది. దాంతో తక్కువ ఆకలి అవుతుంది. బరువు తొందరగా తగ్గుతారు. బెండకాయలో పొలిట్, యాసిన్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కి, కాల్షియం, రాగి, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, జింక్ లాంటివి అధికంగా ఉంటాయి.

బెండకాయలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఉపయోగపడే పదార్థం కూడా ఉంటుంది. అలాగే గుండె జబ్బులకు కొలెస్ట్రాలకు ముఖ్య కారణం. ఈ బెండకాయని తీసుకోవడం వల్ల ఆ సమస్య తగ్గిపోతుంది. బెండకాయ ఎక్కువ మొత్తంలో కరగని డైటరీ ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది మొత్తం ముఖ్యంగా ప్రేగులను శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రేగునే ఆరోగ్యంగా ఉంచటంతో పాటు పెద్దపెద్ద వ్యాధులను తగ్గించడానికి గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. అలాగే షుగర్ ఉన్నవారికి కూడా ఈ బెండకాయ గొప్ప ఔషధం. దీనిలో అధిక శాతం ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిగా జరిగేందుకు తోడ్పడుతుంది. ఇతర కూరగాయ సేలతో పోల్చుకుంటే బెండకాయలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.