మన వంటింట్లో ఉండే పోపు దినుసులలో ఆవాలు కూడా ఒకటి. ఎలాంటి కూరకు పోపు వేసిన అందులో తప్పనిసరిగా ఆవాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి కూరకు రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. అందుకే ఆవాలని తరచుగా తీసుకోవాలని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది ఆవాలను అవాయిడ్ చేస్తూ ఉంటారు. అవాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని ప్రతి కూర పోపులో వేస్తుంటారు. ఆవాలు ఫుడ్ రుచిని బాగా పెంచుతాయి. కానీ ఈ చిన్న గిజంలు మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఆవాల్లో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, సెలీనియంతో పాటుగా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మన జీర్ణక్రియకు, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
మరీ ఆవాల వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే.. ఆవాలు మన జీర్ణవ్యవస్థకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అజీర్తి సమస్యలు ఉన్న వారికి ఆవాలు ఔషదంతో సమానం అని చెప్పవచ్చు. ఈ విత్తనాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికలను సులభతరం చేయడానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణ శక్తిని పెంచుతుందని చెబుతున్నారు. ఆవాలు మన ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. ఆవాల్లో సెలీనియం అనే ఖనిజం ఉంటుంది. ఇది మన ఎముకలను బలంగా చేస్తుందట. అలాగే ఈ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన గోళ్లను, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయని చెబుతున్నారు.
కేవలం ఆవాలు మాత్రమే కాకుండా ఆవనూనె ను కూడా ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఆవనూనెను వంటలకు ఉపయోగించడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందట. తలనొప్పితో ఇబ్బంది పడే వారు ఆవాలు తరచుగా తీసుకోవడం వల్ల ఆ తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు.
ఆవాలలో మెగ్నీషియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఒంటి నొప్పిని తగ్గిస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుందని, అలాగే తలనొప్పిని కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. సీజన్ మారడంతో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఆవాలు మన ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. ఆవాలు మన చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. అలాగే మొటిమలను కూడా తగ్గిస్తాయని చెబుతున్నారు. ఈ విత్తనాల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమల మంటను తగ్గిస్తాయని చెబుతున్నారు.