మునగాకు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. మునగాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ మునగాకు మనకు ఏడాది పొడవునా లభిస్తూ ఉంటుంది. చాలామంది మునగ ఆకులు తినడానికి ఎంతగా ఇష్టపడను. కానీ వీటి వల్ల కలిగే ఉపయోగం తెలిస్తే మాత్రం వాటిని అస్సలు వదిలిపెట్టరు. మరి మునగాకు వల్ల కలిగే ఆ అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మునగాకును మనం నిత్యము వండుకునే కూరలలో కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా దీనిని పొడిగా చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఈ మునగాకులో క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఏ సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
దీనిలో పాలలో కంటే ఎక్కువగా ఈ మునగాకులోనే 17 రెట్లు క్యాల్షియం ఉంటుంది. ఈ మునగాకు నిత్యం తీసుకున్నట్లయితే దంతాలు బలంగా, దృఢంగా ,ఎముకలు గట్టిగా ఆరోగ్యవంతంగా ఉంటాయి. అందుకే ఎదిగే పిల్లలకు ఈ మునగాకు మంచి ప్రయోజనాలను కలిగిస్తుంది. అదేవిధంగా దీనిలో అధికంగా ప్రోటీన్ కూడా ఉంటుంది. కొందరు మాంసాహారం ముట్టని వారు ఈ మునగాకు తీసుకోవడం వలన ఎంతో ప్రోటీన్ అందుతుంది. అదేవిధంగా ఈ మునగాకులో పొటాషియం అరటిపండు లో కన్నా 15 రెట్లు అత్యధిక పొటాషియం కలిగి ఉంటుంది. దీనివలన బ్లడ్ సర్కులేషన్ సరిగా జరిగి రక్తపోటును నుండి కాపాడుతుంది. అలాగే గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతాయి.
అయితే ఈ మునగాకును ఏదో ఒక రూపంలో నిత్యం 7 గ్రాములు తీసుకోవడం వలన బ్లడ్ లో ఉండే షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. అలాగే ఈ ఆకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచడంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే డయాబెటిస్ బాధితులకు ఈ మునగాకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అలాగే ఈ ఆకులో అమినో ఆమ్లాలు పుష్కలంగా ఉండటం వలన కంటికి సంబంధించిన వ్యాధులకి కూడా చాలా బాగా సహాయపడుతుంది. దృష్టిలోపం, రేచీకటి లాంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఈ మునగాకు నిత్యము 7 గ్రాములు చొప్పున మూడు నెలల పాటు తీసుకున్నట్లయితే ఎన్నో వ్యాధుల బారి నుండి బయటపడవచ్చు.