Site icon HashtagU Telugu

Milk: వామ్మో.. పాలు తాగడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలా?

Milk Tax

Milk Tax

పాలు తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొంత మందికి ఉదయం పూట పాలు తాగే అలవాటు ఉంటే మరికొందరికి రాత్రి సమయంలో పడుకునే ముందు పాలు తాగే అలవాటు ఉంటుంది. ఇలా ఒక్కొక్కరూ పాలని ఒక్కొక్క సమయంలో తాగుతూ ఉంటారు. కొందరు మాత్రం పాలన తాగడానికి అంతగా ఇష్టపడరు. పాలు తాగడం వల్ల ఎముకలకు కావలసిన క్యాల్షియం అందుతుంది.
పాలు,పాల ఉత్పత్తులు ప్రోటీన్ యొక్క మంచి వనరులు.

ప్రోటీన్ బరువు తగ్గడానికి అదేవిధంగా బరువును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. పాలలో ఉండే పోషకాలు కడుపు నిండుగా ఉంచుతాయి. దీని వలన ఎక్కువ కాలం ఆకలి అనిపించదు. బరువు తగ్గాలనుకునే వారు టోన్ లేదా స్కిమ్డ్ పాలు తాగాలి. పాలు తీసుకోవడంతో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా అవసరం. పాలు తాగడం వల్ల శరీర కండరాలకు చాలా విశ్రాంతి లభిస్తుంది. రాత్రి పడుకునే ముందు పాలు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది. ప్రతి రోజు పాలు తాగడం వల్ల అవసరమైన క్యాల్షియంను పొందవచ్చు.
పాలు తాగడం వల్ల గుండెజబ్బు, పక్షవాతం ముప్పులు తగ్గుతాయి.

వీటిలోని పొటాషియం, మెగ్నీషియం, పెప్టైడ్ లు రక్తపోటు తగ్గడానికి తోడ్పడతాయి. పాలు దంతం మీదుండే గట్టిపొర దెబ్బతినకుండా చూస్తాయి. పాలు తాగేవారిలో కూల్ డ్రింక్ ల అలవాటూ తక్కువే. ఇదీ దంతాలకు మేలు చేసేదే. పాలలోని ల్యాక్టిక్ ఆమ్లం మృతకణాలను తొలగించి చర్మం కళకళలాడేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు చర్మం ముడతలు పడకుండా కాపాడతాయి. తరచుగా తాజా పెరుగు, మజ్జిగ తీసుకుంటే ఛాతీలో మంట వంటి లక్షణాలూ తగ్గుతాయి. ముఖ్యంగా చల్లటి పాలతో మంచి ఉపశమనం లభిస్తుంది. పెద్ద పేగు క్యాన్సర్ బాధితులకు పాల ఉత్పత్తులను ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. విటమిన్ ఎ లోపం వల్ల తలెత్తే రేచీకటి వంటి కంటి జబ్బులు దూరమవుతాయి. పాలల్లోని రైబోఫ్లేవిన్ నోటిపూత బారినపడకుండా కాపాడుతుంది.

Exit mobile version