Site icon HashtagU Telugu

Mango: సమ్మర్ స్పెషల్.. మామిడి పండ్ల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!

Mango

Mango

మామిడిపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఏడాదిలో కేవలం వేసవికాలంలో మాత్రమే లభిస్తూ ఉంటాయి. మామిడి పండ్ల కోసం ఏడాది మొత్తం ఎదురు చూసేవారు కూడా ఉన్నారు. మామిడి పండును పండ్లలో రారాజుగా కూడా పిలుస్తూ ఉంటారు. సమ్మర్ స్పెషల్ అయినా మామిడి పండ్లు రుచికరంగా ఉండడంతో పాటుగా ఎన్నో రకాల ప్రయోజనాలను ముఖ్యంగా శరీరానికి అనేక ముఖ్యమైన పోషకాలను అందిస్తాయని చెబుతున్నారు. మామిడి పండ్లతో జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మామిడి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుందట. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట.

అలాగే కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందట. అలాగే మామిడి పండు రోగనిరోధక శక్తిని పెంచుతుందట. అలాగే సీజన్‌ వ్యాధులు దరిచేరకుండా శరీరానికి మంచి ఇమ్యూనిటి పవర్‌ లా పనిచేస్తుందని, మామిడి పండ్లలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను నివారిస్తాయని, గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు. మామిడి పండ్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడానికి, ఆరోగ్యకరమైన హృదయనాళ వ్యవస్థకు తోడ్పడతాయని చెబుతున్నారు. మామిడి పండ్లలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటి చూపుకు మేలు చేస్తుందట. మంచి దృష్టికి విటమిన్‌ ఎ అవసరం. వయస్సు సంబంధిత కంటి వ్యాధులను నివారించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుందట.

మామిడి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది ఫ్రీ రాడికల్స్ ప్రభావాల నుండి చర్మాన్ని రక్షిస్తుందట. చర్మ కణాలు దెబ్బతినకుండా నివారిస్తుందని, మామిడి పండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ మిమ్మల్ని ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచడంలో సహాయ పడుతుందని చెబుతున్నారు. అయితే మామిడిపండు మంచిదే కదా అని ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవు. అందుకే మామిడి పండ్లను విధంగా మాత్రమే తీసుకోవాలని అలాగే బయట నుంచి తెచ్చిన మామిడి పండ్లను నీటిలో కనీసం అరగంట సేపు నీటిలో నానబెట్టి అయినా తినాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మామిడి పండు వల్ల కలిగే అనారోగ్య సమస్యలు కలగవట.