Site icon HashtagU Telugu

Mango Peel: మామిడి తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా.. దీని వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్ల బెట్టడం ఖాయం!

Mango Peel

Mango Peel

సమ్మర్ లో మనకు చాలా రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి. ఎన్ని పండ్లు వచ్చిన అందులో చాలామంది ఫేవరెట్ మామిడిపండు.. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ మామిడి పండ్లను ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే పచ్చి మామిడి కాయ లేదంటే మామిడిపండు తిన్న తర్వాత తొక్క పారేయడం అన్నది కామన్. మామిడి తొక్కే కదా అని తీసిపారేస్తూ ఉంటారు. కానీ ఆ మామిడి తొక్క వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామిడి పండు నోట్లో పెట్టుకుంటే కమ్మగా ఉంది కానీ దాని తొక్క తినడం కష్టంగా ఉందని చాలా మంది చెబుతున్నారు.

అయితే మామిడి ముక్కతో తినకపోయినా ఆ తొక్కతో డీటాక్స్ డ్రింక్ గా తయారు చేసుకోవచ్చట. నీటిలో మామిడి తొక్కలు వేసి మరిగించి టీ రూపంలో తాగవచ్చని చెబుతున్నారు. దీంట్లో యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయట. ఇవి మీ షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలో చాలా కీలకంగా పని చేస్తాయని చెబుతున్నారు. డయాబెటిక్ సమస్యతో బాధఫడేవారు ఈ మ్యాంగో పీల్ టీ లేదంటే డీటాక్స్ డ్రింక్ తాగడం అలవాటు చేసుకుంటే వారి షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయట. ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుందని చెబుతున్నారు. కేవలం ఇలా మాత్రమే కాకుండా ఇంకా కొన్ని విధాలుగా కూడా మామిడితొక్కను ఉపయోగించవచ్చట.

నిజానికి మామిడి తొక్కలు సహజ పురుగుల మందుగా మొక్కలకు వాడవచ్చట. ఈ మామిడి తొక్కలో మాంగిఫెరిన్, బెంజోఫెనోన్ లు ఉంటాయట. ఇవి క్రీములు కీటకాలు మొక్కలదరి చేరకుండా అడ్డుకుంటాయట. బయట మార్కెట్లో లభించే పురుగుల మందులు వాడి పంటలను విషంగా మార్చే బదులు ఈ మామిడి తొక్కలను వాడి క్రిమి కీటకాలను దూరం చేయడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాలను పండించవచ్చట. మామిడి కాయ తొక్కలో బయో ఆక్టివ్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయట. వాటిలో యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీలు కూడా ఉంటాయట. ఇవి నోటి ఆరోగ్యానికి ఎక్కువగా సహాయం చేస్తాయట. మామిడి తొక్కలను నమలడం వల్ల లేదా దానితో తయారు చేసిన మౌత్ వాష్ వాడినా కూడా నోరు శుభ్రపడుతుందని,దంత సమస్యలు కూడా రాకుండా ఉంటాయని చెబుతున్నారు.