Mango: వేసవిలో దొరికే మామిడిపండు వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?

వేసవికాలంలో మనకు అనేక రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి. వీటిలో మామిడి పండ్లు కూడా ఒకటి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా మామిడి

  • Written By:
  • Publish Date - February 3, 2024 / 11:00 AM IST

వేసవికాలంలో మనకు అనేక రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి. వీటిలో మామిడి పండ్లు కూడా ఒకటి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా మామిడి పండ్లను ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తరచూ తీసుకోవడానికి ఇవి కేవలం ఎండాకాలంలో మాత్రమే దొరుకుతాయి కాబట్టి ఆ సీజన్లో దొరికే పంటను అస్సలు మిస్ చేసుకోకూడదు. అలా అని ఎక్కువగా తినకూడదు. మరి మామిడికాయ వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ పండు కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది.

మామిడి పండ్లను స్కిన్ మాస్క్ లా ముఖానికి ఉపయోగించడం వల్ల మొటిమలు వాటి తాలూకా వచ్చే మచ్చల సమస్యకు చెక్ పెట్టవచ్చు. మామిడి పండు లో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. పైబ‌ర్ కూడా ఉండ‌టం వ‌ల‌న శ‌రీరానికి హాని చేసే చెడు కొల‌స్ట్రాల్ ని త‌గ్గిస్తుంది. ఈ పండు లో పొటాషియం, మెగ్నీషియం ఉండ‌టం వ‌ల్ల అధిక ర‌క్త‌పోటు నుంచి ర‌క్షిస్తుంది. ఈ పండు తో చ‌ర్మం పైన ఉన్న‌ ముడ‌త‌ల‌ను, న‌ల్ల‌మ‌చ్చ‌ల‌ను తొల‌గించ‌డానికి ఉప‌యెగ‌ప‌డుతుంది. ఈ పండు తిన‌డం వ‌ల‌న అధికంగా మెగ్నిషియం ల‌భిస్తుంది. అంతే కాదు చ‌ర్మంపైన ఉన్న జిడ్డుని మొటిమ‌ల‌ని కూడా తొల‌గిస్తుంది. ఈ పండు లో బిటాకెరోటిన్ అనే ప‌దార్థం ఉండ‌టం వ‌ల్ల రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది, కాబ‌ట్టి క‌రోనాని కూడా రాకుండా అడ్డుకోనేందుకు మామిడి పండు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది.

పంటి స‌మ‌స్య‌లు ఉంటే త‌ప్ప‌నిస‌రిగా మామిడి పండును తినాలి. పంటి నుండి వ‌చ్చే ర‌క్త‌స్రావాన్ని ఇది త‌గ్గిస్తుంది, అంతే కాదు దంతాల మధ్య ఉన్న బ్యాక్టీరియాను కూడా ఇది న‌శింప‌చేస్తుంది. దంతాల‌ పైన వున్న ఎనామిల్ ని బ‌లోపేతం చేస్తుంది. మామిడి పండు వ‌ల్ల జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా, బ‌లంగా పెరుగుతుంది. అలాగే మామిడి పండు తిన‌డం వ‌ల్ల శృంగార వాంఛ‌లు పెరుగుతాయి. మామిడి పండులో కాప‌ర్ ఉండ‌టం వ‌ల్ల ఎర్ర ర‌క్త‌క‌ణాలు వృధ్ధిచెందుతాయి. ఈ పండు లో విట‌మిన్ సి, విట‌మిన్ ఎ, విట‌మిన్ బి6, విట‌మిన్ కె, ప్రోటిన్, పైబ‌ర్, పోలిక్ యాసిడ్, మెగ్నీషియం ఉంటాయి. వీటి వ‌ల‌న ఊబ‌కాయం, మ‌దుమేహం, గుండె జ‌బ్బులు వంటివి ద‌రిచేర‌వు. సూర్యుడి నుంచి వచ్చే అతినీల‌లోహిత కిర‌ణాల నుండి మ‌న చ‌ర్మాన్ని కాపాడుకోవ‌డానికి కూడా మామిడి పండు ఉప‌యోగ‌ప‌డుతుంది.