Site icon HashtagU Telugu

Lemon Peels: నిమ్మ తొక్కలను పడేస్తున్నారా.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు పడేయరు?

Mixcollage 18 Feb 2024 09 01 Pm 390

Mixcollage 18 Feb 2024 09 01 Pm 390

మామూలుగా నిమ్మకాయను మనం తరచుగా వినియోగిస్తూ ఉంటాం. రకరకాల వంటలు ఈ నిమ్మకాయను వినియోగిస్తూ ఉంటారు. అలాగే లెమన్ జ్యూస్ తాగడానికి లెమన్ రైస్ చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. నిమ్మకాయ రసం తీసుకున్న తర్వాత వాటి తొక్కలను బయటకు విసిరిస్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. నిమ్మ తొక్కల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం వాటిని అస్సలు పడేయరు. మరి నిమ్మ తొక్కల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికొస్తే..

నిమ్మకాయ జ్యూస్ తీసిన తర్వాత ఆ తొక్కలని ఎండబెట్టి పౌడర్ చేసి ఆ పౌడర్ ని కూరల్లో వాడుకోవచ్చు. అలాగే గోరువెచ్చని నీటిలో కలిపి ప్రతి రోజు తీసుకోవచ్చు. ఈ విధంగా వాడుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. నిమ్మకాయ తొక్కులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అది కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. నిమ్మ తోక్కల్లోని విటమిన్ సి తెల్ల రక్తకణాల సంఖ్య పెరిగేలా చేస్తుంది. తెల్ల రక్త కణాలు క్యాన్సర్ కణాల అంతు చూస్తాయి. అందరికీ తెలిసిందే నిమ్మకాయలు ఉండే విటమిన్ సి ఏ కాల్షియం, ఫైబర్, పొటాషియం లు ఉంటాయి. అందులోనూ మనకు ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి.ఇది దంతాలు ఎముకలను దృఢంగా ఉంచుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. కండరాల పనితనం మెరుగుపడుతుంది.

హార్మోన్లు సరిగా పనిచేస్తాయి. క్యాన్సర్లను అడ్డుకునే పవర్ఫుల్ ఔషధ గుణాలు నిమ్మకాయ తొక్కులో ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల హై బీపీ తగ్గుతుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. మన శరీరంలోకి ప్రవేశించిన వెంటనే అవి విటమిన్ ఏ గా మారుతాయి. దీంతో నేత్ర సమస్యలు పోతాయి. అలాగే గాయాలు, పుండ్లు త్వరగా తగ్గుతాయి. నిమ్మకాయ తొక్కును సంకల్లో రుద్దుకుంటే చెమట దుర్వాసన రాదు. ఈ తొక్కను ముఖంపై రుద్దుకుంటే నిమ్మకాయ మొటిమలు పోతాయి. తొక్కుతో జ్యూస్ చేసుకుని తాగితే కలరా వ్యాధి సైతం తగ్గిపోతుంది. అలాగే ఈ జ్యూస్ లకు దోమల లార్వాను చంపే శక్తి కూడా ఉంది. వాటిపై ఈ జ్యూస్ ను స్ప్రే చేస్తే చాలు దోమల ఉత్పత్తి ఆగిపోతుంది.

Exit mobile version