Site icon HashtagU Telugu

Health Benefits: కుప్పింటాకు వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే?

Mixcollage 03 Jan 2024 08 59 Pm 9925

Mixcollage 03 Jan 2024 08 59 Pm 9925

కుప్పింటాకు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో ఎన్నో రకాల ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు. కానీ ఈ కుప్పింటాకు వల్ల కలిగే ప్రయోజనాలు తెలియక చాలామంది దీనిని తిక్క ఆకు అని అంటూ ఉంటారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో పెరిగితే వెంటనే వాటిని పీకి పారిస్తూ ఉంటారు. కానీ ఈ కుప్పింటాకు వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఆ మొక్కను ఇంట్లో పెంచుకోవడం ఖాయం. మరి కుప్పింటాకు మొక్క వల్ల కలిగే ప్రయోజనాలు విషయానికి వస్తే.. ఈ కుప్పింటాకు ఎన్నో ఔషధగుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకుల ర‌సం ద్వారా ఎన్నో రకాల వ్యాధులను దూరం చేయ‌వ‌చ్చు.

దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారికి కుప్పింటాకు ర‌సం తీసుకుంటే క్ష‌ణాల్లో ఉప‌ష‌మ‌నం ల‌భిస్తుంది. అంతే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అలాగే కాలిన గాయాల‌కు కూడా కుప్పింటాకును మొత్త‌గా పెస్టులా చేసి అందులో ప‌సుపు క‌లిపి రాస్తే వెంట‌నే త‌గ్గిపోతాయి. ప్ర‌ధానంగా కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఈ కుప్పింటాకు దివ్యఔష‌దంలా ఉప‌యోగ‌ప‌డుతుంది. పంటి నొప్పి, చిగుళ్ల నుంచి రక్తం కార‌కుండా నివారిస్తుంది. అలాగే దంతాలు తెల్ల‌గా మార‌డానికి తోడ్ప‌డుతుంది. కుప్పింటాకు ర‌సంలో పసుపు, నిమ్మ‌ర‌సం క‌లిపి ఈ మిశ్ర‌మాన్ని నొప్పులు ఉన్న చోట రాస్తే ఉప‌ష‌మ‌నం ల‌భిస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ ఆకుల ర‌సంలో కొబ్బరినూనెతో క‌లిపి వేడి చేసుకుని రాసుకోవడం వల్ల నొప్పులు త‌గ్గిపోతాయి.

ఈ ఆకులతో తయారు చేసిన టీ తాగితే కడుపులోని నులిపురుగులు తొలగిపోతాయి. అలాగే కడుపు నొప్పి సమస్యను కూడా దూరం చేస్తుంది. అలాగే ఈ ఆకుల‌తో చ‌ర్మ సౌంద‌ర్యాన్ని కూడా కాపాడుకోవ‌చ్చు. కుప్పింటాకు ల‌ను పేస్టులా త‌యారు చేసుకుని అందులో ప‌సుపు క‌లిపి ముఖానికి ప‌ట్టిస్తే మొటిమలు మచ్చలు తొలిగిపోతాయి. అలాగే ఈ ఆకుల‌ను విష పురుగులు కాటేసిన‌ప్ప‌డు విరుగుడుగా ఉప‌యోగిస్తారు. పాము,తేలు వంటి విష‌పు పురుగులు కాటేస్తే ఈ ఆకుల‌లో మిరియాలు క‌లిపి త‌మ‌ల‌పాకుతో క‌ట్టుగా క‌డ‌తారు. అలాగే దుర‌ద స‌మ‌స్య ఉంటే ఈ ఆకుల‌ను ఉప్పుతో క‌లిపి రాస్తే స‌మ‌స్య పోతుంది. ఈ ఆకుల ర‌సాన్ని తాగితే మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్యకు చెక్ పెట్టవచ్చు.