Health Benefits: జలుబు ముక్కుదిబ్బడతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ కషాయం తాగాల్సిందే?

శీతాకాలం మొదలైంది అంటే చాలు చాలామందికి జలుబు దగ్గు ముక్కుదిబ్బడ లాంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ జలుబు కారణంగా తల మొత్తం

  • Written By:
  • Publish Date - December 24, 2023 / 07:00 PM IST

శీతాకాలం మొదలైంది అంటే చాలు చాలామందికి జలుబు దగ్గు ముక్కుదిబ్బడ లాంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ జలుబు కారణంగా తల మొత్తం భారంగా అనిపించడం జ్వరం వచ్చినట్టు అనిపించడం నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. దీంతో చాలామంది ఏం చేయాలో తెలియక డాక్టర్లు చెప్పే ఇంగ్లీష్ మందులను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఒకవేళ ఆ ఇంగ్లీష్ మందులు వాడినా కూడా మీకు జలుబు తగ్గకపోతే ఇంట్లో అమ్మమ్మ చేసే ఈ కషాయాన్ని తాగితే చాలు. ఎలాంటి జలుబు అయినా కూడా వదిలాల్సిందే. మరి ఆ కషాయాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అందుకు ఎటువంటి పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ కషాయాన్ని రెండేళ్ల చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా చక్కగా తీసుకోవచ్చు. ఇందుకోసం జీలకర్ర, లవంగాలు, లెమన్ గ్రాస్ దాల్చిన చెక్క, వాము, పుదీనా, తులసి ఆకులు, బెల్లంపొడి, అల్లం, పసుపు, మిర్యాల పొడి, రెండు గ్లాసుల నీళ్లు కావాలి. కషాయం తయారీ విధానం.. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ ని పోసుకోవాలి. ఇందులోకి రెండు ఇంచుల దాకా దాల్చిన చెక్క వేయాలి. దాల్చిన చెక్క యాంటీ ఆక్సిడెంట్ కింద చాలా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత ఇందులో 5 లేదా 6 లవంగ మొగ్గలు వేసుకోవాలి. ఇది బ్యాక్టీరియాని కంట్రోల్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది.

ఇప్పుడు ఇందులోకి ఒక టీస్పూన్ దాకా జీలకర్రని ఆడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా దంచుకున్న మిరియాలు వేసుకోవాలి. అలాగే దంచిన అల్లం కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి రెండు రెమ్మలు దాకా పుదీనాని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ దాకా తులసి ఆకుల్ని కూడా తుంచుకుని వేసుకోవాలి. తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా లెమన్ గ్రాస్ ని వేసుకోవాలి. అనంతరం పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. చివరగా ఇందులోకి ఒకటి లేదా ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా బెల్లం పొడిని గాని తురుముకున్న బెల్లాన్ని వేయాలి. బెల్లానికి చాలానే ఔషధ గుణాలు ఉన్నాయండి. వీటన్నిటిని వేసేసిన తర్వాత మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేయాలి. ఆ తర్వాత స్టౌ ఆపేసేసి కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంతవరకు ఉంచి అప్పుడు ఫిల్టర్ చేసుకుని ఈ కషాయాన్ని తీసుకోవాలి. అయితే ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి జలుబు అయినా సరే తగ్గిపోవాల్సిందే. ఇది కాస్త ఘాటుగా మంటగాను అనిపిస్తూ ఉన్నప్పటికీ దాని తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.