Site icon HashtagU Telugu

Kalonji Seeds: ఏంటి.. కలోంజి సీడ్స్ తో ఏకంగా అన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చా?

Kalonji Seeds

Kalonji Seeds

కలోంజి సీడ్స్ .. చాలామందికి ఈ విత్తనాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియదు. ఇవి మంచి సువాసనను కలిగి ఉండడంతో పాటు ఎంతో రుచిని కూడా అందిస్తాయని చెబుతున్నారు. ఈ కలోంజీ విత్తనాలలో విటమిన్లు ఫైబర్ అమైనో ఆమ్లాలు ప్రోటీన్ కొవ్వులు వంటివి పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ గింజలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. మరి ఈ గింజల వల్ల కలిగే ప్రయోజనాల విషయానికొస్తే.. వర్షాకాలంలో రకరకాల చర్మ సమస్యలు వస్తాయి. సోరియాసిస్ లేదా మొటిమల సమస్యలు వస్తుంటాయి. కలోంజి విత్తనాలు వీటి లక్షణాలను తగ్గించడానికి సహాయపడతాయట. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఈ చర్మ సమస్యలను దూరం చేస్తాయట.

ఇది సోరియాసిస్, మొటిమల లక్షణాలను మెరుగుపరచడానికి, బొల్లి గాయాలను తగ్గించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. ఈ బ్లాక్ సీడ్స్ బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయట. ఈ నల్ల విత్తనాలలో కొవ్వును తగ్గించడానికి సహాయపడే క్రియాశీల పదార్థాలు ఉన్నాయట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లు కూడా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. ఆహారంలో కలోంజిని చేర్చడం వల్ల మీ థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేస్తుందట.

నల్ల విత్తనాలను తినడం వల్ల టిఎస్హెచ్, థైరాయిడ్ ప్రతిరోధకాలు తగ్గుతాయని చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ ఒక సాధారణ సమస్య. ఇది గుండెపోటు, అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు, మరెన్నో ఆరోగ్య సమస్యలొచ్చే ప్రమాదాన్ని పెంచుతుందట. కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. అయితే కలోంజి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.