Jaggery: గ్యాస్ సమస్య ఉన్నవారు బెల్లం తింటే ఏం జరుగుతుందో తెలుసా?

బెల్లం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇది వరకటి రోజుల్లో

  • Written By:
  • Publish Date - January 26, 2023 / 06:30 AM IST

బెల్లం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇది వరకటి రోజుల్లో ఎక్కువగా తీపి పదార్థాలకు బెల్లాన్ని ఉపయోగించేవారు. కానీ రాను రాను బెల్లాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ప్రతి ఒక్క స్వీట్ ఐటమ్ కి చక్కరను ఉపయోగిస్తున్నారు. కొన్ని సందర్భాలలో మాత్రమే బెల్లం ని ఉపయోగిస్తున్నారు. మరి బెల్లం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బెల్లం తినడం వల్ల మలబద్ధకాన్ని నివారించుకోవచ్చు. బెల్లంశరీరంలోని జీర్ణక్రియ కు ఉపయోగపడే ఎంజైమ్‌లు సక్రమంగా పనిచేయడం కోసం ఉపయోగపడుతుంది.

మూత్రవిసర్జన సాఫీగా జరిగేందుకు తోడ్పడుతుంది. భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి, జీర్ణక్రియకు సహకరిస్తుంది. అలాగే బెల్లం శరీరం నుండి హానికరమైన విషాన్ని బయటకు పంపిస్తుంది. తద్వారా కాలేయాన్ని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. అలాగే టీ తాగేటప్పుడు చక్కెరకు బదులుగా బెల్లాన్ని చేర్చుకోవడం వల్ల బెల్లం శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. అందుకే చాలామంది చలికాలంలో బెల్లాన్ని తింటూ ఉంటారు. బెల్లం తినడం వల్ల రక్తం శుద్ధి చేయబడుతుంది. బెల్లం యాంటీఆక్సిడెంట్లు, జింక్, సెలీనియం వంటి ఖనిజాలతో నిండి ఉంటుంది.

ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడే రోగ నిరోధకతను పెంచుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. అలాగే బెల్లంలో ఇనుము, ఫోలేట్ అధికంగా ఉంటాయి. రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాల సాధారణ స్థాయిని నిర్వహించేలా చేస్తుంది. గర్భిణీ స్త్రీలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బెల్లం శరీర ఉష్ణోగ్రతలను క్రమబద్దీకరిస్తుంది. బెల్లంలో పొటాషియం, సోడియం ఉంటుంది. ఇవి శరీరంలో యాసిడ్ స్థాయిల నిర్వహణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు, బెల్లం తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అలాగే బెల్లం తినడం వల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చు. అలాగే బెల్లం తినడం వల్ల గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అన్నం తిన్న వెంటనే చాలామంది జీర్ణం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటివారు అన్నం తిన్న వెంటనే బెల్లం తినడం వల్ల తిన్న ఆహారం జీర్ణం అవుతుంది.