Site icon HashtagU Telugu

Jack Fruit: పనస పండు వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు?

Mixcollage 01 Feb 2024 12 02 Pm 535

Mixcollage 01 Feb 2024 12 02 Pm 535

పనస పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. పనసపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ప‌న‌స పండు ఎక్కువ‌గా ఎండాకాలంలో దొరుకుతాయి. కాగా పండ్లల్లో కెల్లా అతి పెద్ధ పండు ప‌న‌సు పండు. ఇది చాలా పెద్ధ‌దిగా ఉంటుంది. ఈ పండు విత్త‌నాల‌లో ఎక్కువ‌గా ప్రోటిన్ పిండి పదార్థాలు ఉంటాయి. అలాగే ఇందులో పోష‌కాలు ఉంటాయి. క్యాల్షియం , నియాసిన్, పోటాషియం,ఐర‌న్, పోలిక్ యాసిడ్, మెగ్నిషియం, విట‌మిన్లు ఎ, సి , బి6 థియామిన్, రిబోప్లేన్ వంటి పోష‌కాలు ఉంటాయి. ఇది అనేక ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను రాకుండా చేస్తుంది.

ప‌న‌స పండులో విట‌మిన్ ఎ ఉంటుంది. ఇది క‌ళ్ళ‌కు మేలు చేస్తుంది. కంటి శుక్లం, రేచీక‌టి వంటి కంటి స‌మ‌స్య‌ల‌ను కూడా త‌గ్గిస్తుంది. ఈ పండులో కాల్షియం, మెగ్నిషియంలు అధికంగా ఉంటాయి. కావునా ఎముక‌ల‌ను బ‌లంగా చేస్తాయి. ఇది బోలు ఎముక‌ల వ్యాధిని రాకుండా చేయ‌టానికి ఇది ఎంత‌గానో స‌హ‌య‌ప‌డుతుంది. జాక్ ప్రుట్ లో పైబ‌ర్ ఉంటుంది. అందు వ‌ల‌న జిర్ణ‌క్రియ‌ను మేరుగు ప‌రుస్తుంది. త‌ద్వారా మ‌ల‌ద్ధ‌కంను నివారిస్తుంది. ప‌న‌స పండులో యాంటి ఆ క్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

దీనిలో విట‌మిన్ సి, నీటి శాతం ఎక్కువ‌గా ఉండ‌టం వల్ల మ‌న చ‌ర్మాన్ని ముడ‌త‌లు ప‌డ‌కుండా, పొడిబార‌నివ్వ‌కుండా చేస్తుంది. శ‌రిరాన్ని ఢీహైడ్రేష‌న్ కాకుండా చేస్తుంది. ఈ పండులో విట‌మిన్ కె ,పైబ‌ర్, మాంగ‌నిస్, యాంటి ఆక్సిడెంట్లు వంటి ఉండ‌టం వ‌ల‌న చ‌ర్మం, పెద్ధ ప్రేగు , నోటి క్యాన్స‌ర్ వ్యాదుల వంటి వాటితో పోరాడి విటివ‌ల‌న వచ్చే ప్రమాదాల‌ నుండి మ‌న శ‌రిరాన్ని కాపాడుతాయి. వ్యాది నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. జాక్ ప్రుట్ ని తిన‌డం వ‌ల‌న ర‌క్త‌హిన‌త‌ను త‌గ్గిస్తుంది. దీనిలో ఐర‌న్ అధికంగా ఉంటుంది. కావునా మ‌న శ‌రిరంలో ర‌క్తాన్ని వృద్ధిచేయ‌టానికి ప‌న‌స పండు కూడా ఉప‌యోగ ప‌డుతుంది. జాక్ ప్రుట్ పులుపును క‌లిగి ఉంటుంది. ఎందుకంటే ఇది విట‌మిన్ సి ను క‌లిగి ఉంటుంది. యాంటి ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉండ‌టం వ‌ల‌న బాక్టిరియాలు, వైర‌ల్ ఇన్ఫేక్ష‌న్స్ నుండి కాపాడుతూ వ్యాది నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. దీని వ‌ల‌న జ‌లుబు, ద‌గ్గు వ‌ల‌టివి రాకుండా చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.