Cashew: డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన జీడిపప్పు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. జీడిపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎన్ని రకాల స్వీట్ల తయారీలో జీడిపప్పును ఉపయోగిస్తూనే ఉంటారు. అయితే కొందరు జీడిపప్పును నేరుగా తినడానికి ఇష్టపడితే మరి కొందరు స్వీట్ల రూపంలో తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ జీడి పప్పును ఇప్పుడు చెప్పినట్టుగా తీసుకుంటే ఆరోగ్యంగా బరువు పెరగవచ్చు అని చెబుతున్నారు. వీటిని అలా నేరుగా తినకుండా తేనె కలిపి తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇది బయట దొరికే జీడిపప్పు కాకుండా ఇంట్లోనే తయారుచేసి తీసుకోవాలట.
జీడిపప్పు, తేనె రెండు వేర్వేరు కూడా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అయితే ఈ రెండింటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తేనె, జిడీపప్పుల్లో విడివిడిగానే పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఇవి విడివిడిగానే బాడీకి ఎంతగానే మేలు చేస్తాయట. వీటిని అలానే నేరుగా తీసుకోకుండా, ఇంట్లోనే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మీకు మీరుగానే సహజంగా తయారు చేసుకుని తీసుకోవడం మంచిదట. దీని వల్ల ఎలాంటి కెమికల్స్ మీ బాడీపై నెగటీవ్ ఎఫెక్ట్స్ చూపించవట. పైగా కొన్ని లాభాలు కూడా ఉంటాయని, అయితే వీటిని తయారు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు మంచి క్వాలిటీ జీడిపప్పు, తేనెలు వాడాలట. స్వచ్ఛమైనవి తీసుకోవడం మంచిదని చెబుబతున్నారు. జీడిపప్పుల్లో ప్రోటీన్లని విచ్చిన్నం చేయడంలో హెల్ప్ చేసే ప్రత్యేకమైన ఎంజైమ్ ఉంటుందట.
తేనెలో ప్రీబయోటిక్ గుణాలు ఉన్నాయి. ఇవి ప్రేగుల్లోని హెల్దీ బ్యాక్టీరియాని పెంచి జీర్ణ వ్యవస్థని చురుగ్గా ఉంచేందుకు హెల్ప్ చేస్తాయట. దీంతో గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు రాకుండా చేస్తాయట. చర్మాన్ని ఆరోగ్యంగా మార్చడంలో తేనె ముందు ఉంటుందని చెబుతున్నారు. దీనిని తీసుకోవడం వల్ల చర్మ కణాలు బలంగా మారతాయట. దీని వల్ల చర్మ సమస్యలైన తామర, ముడతలు, మొటిమలు, ఫైన్‌లైన్ వంటి చర్మ సమస్యల్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. జీడిపప్పుని తేనెలో నానబెట్టినప్పుడు ఎఫెక్టివ్ గా పనిచేస్తుందట. తేనెలో నానబెట్టిన జీడిపప్పులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుందని, ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తుందని చెబుతున్నారు. జీడిపప్పులో మెగ్నీషియం, కాపర్‌లు పుష్కలంగా ఉంటాయని, ఇవి బాడీలో ఎనర్జీని పెంచుతాయని తేనెతో కలిపి సహజంగానే పెరుగుతుందని చెబుతున్నారు.
తేనె మన బాడీకి అందితే శక్తి పెరుగుతుందట. ఇది నీరసం లేకుండా, అలసట లేకుండా చేస్తుందట. ఇవి సహజ ఎనర్జీ బూస్టర్ లా పనిచేస్తుందట. తేనె, జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయట. ఇవి ఫ్రీ రాడికల్స్ ఎఫెక్ట్స్‌ని తగ్గిస్తాయట. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి కూడా తగ్గుతుందట. స్ట్రెస్ వల్ల వచ్చే సమస్యల్ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయట. ఈ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చట. జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని, తేనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని, ఇవి శరీరంలో మంటని తగ్గిస్తాయట. దీర్ఘకాలిక మంటని తగ్గించడంలో హెల్ప్ చేస్తుందట. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, విటమిన్స్, ఖనిజాలు ఇమ్యూనిటీని పెంచుతాయట. ఇన్ఫెక్షన్స్‌ని తగ్గించి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడతాయని చెబుతున్నారు. జీడిపప్పులో అసంతృప్త కొవ్వులు ఉంటాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడే ముఖ్యమైన విటమిన్స్, ఖనిజాలు కూడా ఇందులో ఉంటాయట. తేనెలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతాయట. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో హెల్ప్ చేస్తాయట. కొంతమంది ఉండాల్సిన బరువు కంటే తక్కువ బరువుతో ఉంటారు. అలాంటి వారు నేచురల్‌గానే బరువు పెరగాలనుకుంటే తేనెలో నానబెట్టిన జీడిపప్పు తినవచ్చట. రెండింటిలోనూ హెల్దీ బరువుగా బరువు పెరగడానికి సరిపడా కేలరీలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల హెల్దీగా బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Cashew: కొలెస్ట్రాల్ తగ్గించుకుంటూనే ఆరోగ్యంగా బరువు పెరగాలంటే జీడిపప్పును ఇలా తీసుకోవాల్సిందే!

Cashew