Site icon HashtagU Telugu

Dried Tomatoes: ఎండిన టమోటాలతో ఆరోగ్యాలతో పాటు అలాంటి సమస్యలకు చెక్?

(Tomatoes- Blood Pressure

Dried Tomatoes

మన వంటింట్లో దొరికే కూరగాయలలో టమోటా కూడా ఒకటి. చాలా వంటకాలు టమోటా లేనిదే పూర్తి అవ్వవు. ఇక టమోటాతో చేసే కర్రీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టమోటాను ఉపయోగించి పదుల సంఖ్యలో కర్రీలు తయారు చేయవచ్చు. టమోటాలో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.. అంతే కాకుండా శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్, సహజ చక్కెర, ఫైబర్‌, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఐరన్, ఫాస్పరస్, విటమిన్ ఎ, ఇ, సి, బి6, రిబోఫ్లావిన్‌ వంటివి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే కేవలం తాజా టమాటాల వల్లే కాకుండా డ్రై ఎమోటాల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

డ్రై టమోటాలు అంటే ఎండిన టమాటాలు. ఎండిన టమాటాలలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిలో విటమిన్ సి, కె, నియాసిన్, కాపర్, ప్రొటీన్, మాంగనీస్, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాగా మన డైట్ లో డ్రై టమాటాలు చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. డ్రై టమోటాలలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్‌ సి యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇది తీవ్రమై ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. న్యుమోనియా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు తగ్గుతుంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు విటమిన్‌ సి తీసుకోవడం మంచిది. టొమాటాలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.

ఇది రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే హైపర్‌టెన్షన్‌ కారణంగా గుండె సమస్యలు, గుండె పోటు, కిడ్నీ వ్యాధులు, గుండె పోటు వంచి సమస్యలు వచ్చే ప్రమాదాలను డ్రై టమాటాలు తగ్గించడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. అలాగే టమాటాలలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. పొటాషియం అధిక రక్తపోటను తగ్గిస్తుంది. డ్రై టమోటాలు తీసుకోవడం వల్ల ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాల్షియం ఎముకల దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది గుండె కండరాలను కూడా బలపరుస్తుంది. ఎండిన టమోటాలు మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ట్రిక్‌ వంటి సమస్యలను దూరం చేస్తాయి.

Exit mobile version