Guava leaves: జామపండ్ల వల్లే కాదండోయ్ ఆకుల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు?

జామకాయ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. జామ

  • Written By:
  • Publish Date - January 19, 2023 / 06:30 AM IST

జామకాయ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. జామ పండులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. జామకాయను పేదవాడి యాపిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. జామపండ్లు దాదాపుగా మనకు అన్ని సీజన్ లలో లభిస్తూ ఉంటాయి. ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి కంటె జామపండులో విటమిన్ సి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. జామకాయను తినడం ద్వారా దంతాలు, చిగుళ్లకు బలం చేకూరుతుంది. జామపండును రోజుకు రెండేసి తీసుకోవడం ద్వారా పేగు, కడుపు, జీర్ణాశయం, కాలేయ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత బాగా పండిన జామపండును తినడం ద్వారా జీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే పిల్లల్ని జామపండ్లను తినేలా చేస్తే దంతాలు, చిగుళ్లు దృఢమవుతాయి. జామపండ్లే కాదు జామ ఆకులు, వేళ్లలోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే జామపండ్లు మాత్రమే కాదు జామ ఆకులతోనూ చాలా ప్రయోజనాలున్నాయి. జామ ఆకులతో టీ తయారుచేస్తారని చాలా మందికి తెలియదు. అయితే మరి జామకాయల ఆకులతో కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. జామ పండ్ల ఆకుల రసం తాగితే రక్తంలో షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వారికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. నాలుగు జామ ఆకుల్ని నీటిలో పది నిమిషాలు ఉడికించి, ఆ నీటిని తాగేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.

జామ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు విషవ్యర్థాలను చంపేసి గుండెకు మేలు చేస్తాయి. పీరియడ్స్ టైమ్‌లో మహిళలు నొప్పితో చాలా బాధపడుతుంటారు. ఆ సమయంలో వారు ఈ రసం తీసుకుంటే కాస్త ఉపశమనం కలుగుతుంది. అలాగే జామ ఆకుల రసం జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తాయి. జామ ఆకుల రసంతో అధిక బరువు సమస్యకూ చెక్ పెట్టవచ్చు. జామ ఆకుల్లో కాన్సర్‌ను నిరోధించే గుణాలు ఉన్నాయి. కాన్సర్ కణాల సంఖ్య పెరగకుండా కూడా ఇది చేస్తుంది. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా జామ ఆకులు బాగానే పనిచేస్తాయి. ముఖ్యంగా చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది.