Site icon HashtagU Telugu

Fennel Seeds: సోంపు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

Fennel Seeds Benefits

Fennel Seeds

సోంపు గింజల వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. సోంపు గింజలు ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయి. ఈ గింజలలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటి సెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం, కాపర్, ఐరన్, ఫైబర్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, విటమిన్ బి, ప్రోటీన్, విటమిన్ సి వంటివి లభిస్తాయి. ఈ సోంపు గింజల వల్ల ఇంకా ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

భోజనం చేసిన తర్వాత ఈ సోంపు గింజలను తినడం వల్ల తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. అందుకే అలాగే రక్తం తక్కువగా ఉన్నవారు ఈ గింజలను పాలలో కలుపుకొని తాగడం వల్ల రక్తహీనత సమస్య తగ్గడంతో పాటు శరీరానికి కావాల్సిన ఐరన్ కూడా అందుతుంది. సోంపు గింజలలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరం నుంచి ఫ్రీ రాడికల్స్ ని తొలగించడంతోపాటు చర్మంపై ఉండే మడతలను కూడా తొలగిస్తుంది. అలాగే ఈ గింజలు మొటిమల కారణంగా వచ్చే నొప్పి వాపును కూడా తగ్గిస్తాయి. ఈ సోంపు గింజల నీటితో రోజుకు ఒకసారి కడుక్కోవడం మంచిది.

ఇందుకోసం రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో తీసుకుని సోంపు గింజలను వేసి రాత్రంతా నానబెట్టి ఆ నీటితో ఉదయాన్నే ముఖం కడుక్కోవాలి. జీర్ణవ్యవస్థకు సంబంధించిన గ్యాస్, అజీర్థి, ఎసిడిటీ వంటి సమస్యలను దూరం చేయడానికి సోంపు నీళ్లు ఎంతో బాగా పనిచేస్తాయి. సోంపు గింజలలో పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలోని ప్రీరాడికల్స్ ను, టాక్సిన్లను శరీరం నుంచి బయటకు పంపించడానికి ఎంతో సహాయపడతాయి. గింజల్లో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యం బాగుండడంతో పాటు కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. నిద్రలేమి ఆందోళన ఒత్తిడి డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడేవారు రాత్రి పడుకునే గంట ముందు గోరువెచ్చని పాలలో సోంపు గింజల పొడిని,బెల్లాన్ని కలుపుకొని తాగాలి.