Site icon HashtagU Telugu

Eucalyptus Leaves: నీలగిరి తైలం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Mixcollage 01 Dec 2023 04 11 Pm 4974

Mixcollage 01 Dec 2023 04 11 Pm 4974

ప్రకృతి మనకు ఎన్నో రకాల ఔషధాల మొక్కలను అందించింది. అందులో కేవలం కొన్నింటిని మాత్రమే ఉపయోగిస్తున్నాము. మిగతా ముక్కల ఉపయోగాలు తెలియక వాటిని ఉపయోగించడం లేదు. ఆ సంగతి పక్కన పెడితే ప్రకృతి మనకు ప్రసాదించిన మొక్కలలో నీలగిరి మొక్క కూడా ఒకటి. ఈ నీలగిరి మొక్క వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నీలగిరి చెట్టులో ప్రతి ఒక్క భాగం కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఎన్నో రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులకు కీళ్ల నొప్పులకు మనకు ఆయుర్వేద షాపులలో నీలగిరి తైలం అని అమ్ముతూ ఉంటారు.

ఆయుర్వేదంలో కూడా ఈ నీలగిరి ఆకులకు ప్రత్యేక స్థానం ఉన్నది. నీలగిరి చెట్టు ఎక్కువగా చల్లటి ప్రదేశాలలోనూ పెరుగుతుంటాయి. అలాగే కొండ ప్రాంతాల లోను ఎక్కువగా పెరుగుతున్నాయి. ప్రధానంగా దీని జలుబు, జ్వరలకు నివారణగా వాడుతారు. మరి ఈ నీలగిరి మొక్క వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం… కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇతర నొప్పులు నివారణకు ఈ తైలాన్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ నీలగిరి తైలాన్ని మోకాళ్ళ నొప్పులు నివారణ కోసం తయారు చేసి ప్రత్యేకంగా వినియోగిస్తూ ఉంటారు. దీని ప్రభావం చాలా బాగా ఉంటుంది. ఈ నీలగిరి తైలం నూనెను చర్మంపై పూసినప్పుడు దోమలు అలాగే కీటకాలను సమర్ధవంతంగా చంపేస్తుంది. అలాగే నీలగిరి తైలం మన చర్మంలో ఉండే సిరా మైడ్ అనే కొవ్వు ఆమ్లం ఉత్పత్తిని పెంచడం ద్వారా చర్మాన్ని మెరుగుపరుస్తుంది.

అలాగే చుండ్రు, సోరియాసిస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి తైలం రాయడం వలన మంచి ఉత్సవము కలుగుతుంది.ఈ తైలం ఆకులలో యాంటీ బ్యాక్రియలు, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటుంది. దీని వాసన కూడా కొంచెం ఘాటుగానే ఉంటుంది. అంతేకాకుండా కొన్ని శతాబ్దాలుగా నీలగిరి తైలం ఆకులను సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా గాయాలు నయం చేయడానికి పగిలిన పాదాలు పొడి చర్మం, జలుబు పుండ్లు వంటి వాటి చికిత్స కోసం ఈ నీలగిరి తైలాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ నీలగిరి నూనె తేమ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. చర్మానికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. నోటి నుండి హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. కావున నీలగిరి తైలం సారం మౌత్ వాసులు, టూత్ పేస్ట్ లను తయారు చేయడానికి వినియోగిస్తూ ఉంటారు. నీలగిరి తైలం తోనే ఎన్నో ఔషధాలను కూడా తయారు చేస్తారు.