Site icon HashtagU Telugu

Sprouted Fenugreek: మొలకెత్తిన మెంతులు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!

Health Benefits Of Eating Sprouted Fenugreek..!

Health Benefits Of Eating Sprouted Fenugreek..!

మనం వంటల్లో ఉపయోగించే మెంతులు అద్భుతమైన ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. అందుకే చాలా మంది మెంతులను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్ని తింటారు. మెంతులులో క్యాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, ఫోలిక్‌ యాసిడ్‌, రైబోఫ్లావిన్‌, కాపర్‌, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మెంతులలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయిని నిపుణులు చెబుతున్నారు. మెంతులలోని గరిష్ట పోషక ప్రయోజనాలు పొందడానికి, మొలకెత్తిన మెంతులు తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. మొలకెత్తిన మెంతులు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం..

ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతుంది:

మొలకెత్తిన మెంతులలో ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, టానిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మెంతుల మొలకలను తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ స్థాయిలు మెరుగుపడతాయి.

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది:

మొలకెత్తిన మొలకలలో.. పొటాషియం మెండుగా ఉంటుంది. ఇది హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. అధిక కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది, రక్తంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలోనూ సహాయపడుతుంది. ఇవి గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

షుగర్‌ కంట్లోల్‌లో ఉంచుతుంది:

మొలకెత్తిన మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి. షుగర్‌ పెషెంట్స్‌ రోజు మొలకెత్తిన మెంతులు తీసుకుంటే డయాబెటిస్‌ నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, మెంతులు రక్తంప్రవాహంలోకి గ్లూకోజ్‌ను నెమ్మదిగా విడదల చేస్తుంది. దీంతో, బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ అకస్మాత్తుగా పెరగవు. మెలకెత్తిన మెంతులపై మిరియాల పొడి వేసుకుని తీసుకోవచ్చు. లేదా సలాడ్లలో మొలకెత్తిన మెంతులు వేసి తీసుకోవచ్చు.

ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతుంది:

మొలకెత్తే ప్రక్రియ మెంతిలోని పోషక విలువలను పెంచుతుంది. వీటిలోని పోషకాలు మీ కండరాలు, కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. మొలకెత్తిన మెంతులలో శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు మెండుగా ఉంటాయి. మెలకెత్తిన మెంతులలోని గెలాక్టోమన్నన్‌.. మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. అలాగే వీటిలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి, ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఏర్పడకుండా రక్షిస్తాయి, ఫ్రీ రాడికల్స్‌తోనూ పోరాడతాయి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

మెలకెత్తిన మెంతి గింజలు తీసుకుంటే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇవి జీర్ణక్రియ వేగంగా, సులభంగా జరిగేలా సహాయపడతాయి. మొలకెత్తిన మెంతులు ప్యాంక్రియాస్‌లో బీటా కణాల ఏర్పాటును మెరుగుపరుస్తాయి. ఇవి తరచుగా తీసుకుంటే.. అసిడిటీ, అపానవాయువు, విరేచనాలు, అజీర్తి వంటి సమస్యలు పరిష్కారం అవుతాయి.

Also Read:  High Speed Journey: హైస్పీడ్ రైలు వచ్చేస్తోంది.. ఇక హైదరాబాద్ – వైజాగ్ జర్నీ నాలుగు గంటలే..!