Site icon HashtagU Telugu

Soaked Peanuts: నానబెట్టిన పల్లీలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

Soaked Peanuts

Soaked Peanuts

పల్లీలు ఆరోగ్యానికి ఎంతో మంచిది అన్న విషయం మనందరికి తెలిసిందే. వీటి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతీ ఒక్కరూ ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే కొందరు వీటిని వేయించుకొని తింటే మరికొందరు ఉడకబెట్టుకొని తింటూ ఉంటారు. అయితే ఎప్పుడు అయినా పల్లీలను నానబెట్టుకొని తిన్నారా. పల్లీలను నానబెట్టి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. మరి పల్లీలను నానబెట్టి తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పల్లీలను నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయట. అయితే పల్లీల తొక్కలల్లో ఫైటేట్లు, ఆక్సలేట్ లు ఉంటాయి. ఇవి కూడా పోషకాలే. కానీ ఇవి బి విటమిన్లను శరీరం సరిగా గ్రహించబడకుండా అడ్డుపడతాయట. అదే పల్లీలను నానబెట్టడం వల్ల ఈ ఫైటేట్ల ప్రభావాలు తగ్గుతాయి. దీంతో ఇవి చాలా సులువుగా జీర్ణమవుతాయి. నానబెట్టడం వల్ల డ్రై ఫ్రూట్ లో ఉండే ప్రోటీన్ పాక్షికంగా జీర్ణమవుతుందట. అందుకే వీటిని తినడానికి ముందు నానబెట్టడం మంచిదని చెబుతున్నారు. పల్లీలను నానబెట్టడం వల్ల వాటిలో ఫైటిక్ యాసిడ్ పరిమాణం తగ్గుతుంది. ఫైటిక్ ఆమ్లం కూడా ఒక పోషకమే.

అయితే ఇది కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలను శరీరం గ్రహించకుండా అడ్డుపడుతుందట. అయితే వీటిని నానబెట్టడం వల్ల ఫైటిక్ ఆమ్లం తగ్గుతుందట పల్లీల్లోని పోషకాలను జీర్ణక్రియ, శోషణను ఇది పెంచుతుందట. పల్లీలను నానబెట్టడం వల్ల ఫైటిక్ ఆమ్లం తగ్గుతుందట. దీంతో వేరుశెనగలోని ముఖ్యమైన ఖనిజాల శోషణ కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. ఇది గింజల్లో ఉండే మెగ్నీషియం, ఇనుము వంటి ఖనిజాలను శరీరం బాగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. మంచి పోషణ శరీరానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. కొంతమందికి పల్లీలను తినడం వల్ల అలెర్జీ సమస్య వస్తుందట.

అయితే వీటిని నానబెట్టి తినడం వల్ల అలెర్జీ వచ్చే అవకాశం తగ్గుతుందని చెబుతున్నారు. పల్లీల్లో ఉండే కొన్ని రకాల ప్రోటీన్ల వల్ల కూడా చాలా మందికి అలెర్జీ వస్తుందట. అయితే ఈ గింజలను నానబెట్టడం వల్ల అలెర్జీ ప్రతి చర్యల ప్రమాదం తగ్గుతుందట. ఫైటిక్ ఆమ్లంతో పాటుగా పల్లీల్లో లెక్టిన్లు వంటి ఇతర యాంటీ పోషకాలు కూడా ఉంటాయి. పల్లీలను నానబెట్టడం వల్ల ఈ సమ్మేళనాల స్థాయిలు తగ్గుతాయి. ఇది జీర్ణవ్యవస్థకు పల్లీలను సులువుగా అరిగించేందుకు సహాయపడుతుందని చెబుతున్నారు.