Site icon HashtagU Telugu

Soaked Figs: నానబెట్టిన అంజూర పండ్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Soaked Figs

Soaked Figs

అంజూర పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు. అయితే కొంతమంది పచ్చి అంజూర పండ్లు ఇష్టపడితే మరికొందరు డ్రై అంజూరాలను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే చాలామంది అంజూర పండ్లను నానబెట్టుకొని మరి తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. అయితే మరి అంజూర పండ్లను నానబెట్టుకుని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రాత్రిపూట వీటిని ఒక కప్పు నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే తినడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయని చెబుతున్నారు. వీటిని ఇతర డ్రై ఫ్రూట్స్ తో పాటుగా కూడా తినవచ్చు అని చెబుతున్నారు. పండ్లలో విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో నాన పెట్టిన డ్రై అంజూరాలను నీటిలో నానబెట్టి తినడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. మలబద్ధకం సమస్యతో బాధపడుతన్న వారికి అంజీర పండ్లు మెడిసిన్ లాగే పనిచేస్తాయి. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తింటే ప్రేగు కదలికలు మెరుగుపడతాయి. ఈ పండ్లను తింటే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది.

అంతే కాదు అత్తి పండ్లు మన కడుపులో మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచడానికి సహాయపడతాయని చెబుతున్నారు. చలికాలంలో డయాబెటీస్ పేషెంట్లు అంజీర పండ్లను తింటే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిని తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ మెరుగుపడతాయట. వీటిలో ఉండే అబ్సిసిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం, క్లోరోజెనిక్ ఆమ్లం వంటి సమ్మేళనాలు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడతాయట. అలాగే అధిక రక్తపోటును నియంత్రించడానికి పొటాషియం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇది అత్తిపండ్లలో పుష్కలంగా ఉంటుంది. మీరు హైబీపీతో బాధపడుతుంటే ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించి అత్తిపండ్లను మీ రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని వీటిని తింటే బీపీ లెవల్స్ నార్మల్ గా ఉంటాయని చెబుతున్నారు. అత్తి పండ్లను తింటే ఎముకల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందట. వీటిలో కాల్షియం, ఫాస్పరస్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకలను బలంగా ఉంచడమే కాకుండా.. వ్యాధుల నుంచి కూడా రక్షిస్తాయని చెబుతున్నారు.

note: పైన ఆరోగ్య సమాచారం విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.