Sapota and Benefits: సపోటాలతో 10 ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో వెంటనే తెలుసుకోండి!

సపోటా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విపరీతమైన తీపిదనం ఈ పండ్లలో ప్లస్ పాయింట్.

  • Written By:
  • Publish Date - July 6, 2022 / 07:30 AM IST

సపోటా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విపరీతమైన తీపిదనం ఈ పండ్లలో ప్లస్ పాయింట్. తినడానికి ఎంతో ఈజీగా ఉండే ఈ పంటలో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు. అయితే ఈ పండ్లను చాలామంది నేరుగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకొంతమంది మాత్రం ఈ పండ్లను జ్యూసులతో కలిపి తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే ఈ సపోటా చెట్టు స్పెయిన్ దేశానికి చెందినది. అలాగే ఈ సపోటా పండు చెట్లు ఎక్కువగా మధ్య అమెరికాలో కూడా పెరుగుతూ ఉంటాయి. అయితే కొంతమంది స్పెయిన్ నుంచి నౌకాయనం చేసిన వాళ్ళు ఈ పండ్లను ఇండియాకు తీసుకొని వచ్చారు.

అలా ఇప్పుడు ఈ చెట్లు భారతదేశవ్యాప్తంగా పలుచోటలో ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు. ఈ సపోటా పండ్లను తింటే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సపోటా పండ్ల లో విటమిన్ ఎ,సి లు ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపర్చడంతో పాటు వ్యాది నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే సపోట పండ్లు బాడీలో విష వ్యర్తాల్ని బయటకు పంపించి గుండెను కాపాడతాయి. సపోటాల్లో సూక్రోజ్ ఎక్కువ. ఇది వెంటనే ఎనర్జీ ఇస్తుంది. అయితే పనులు చేసి అలసి పోయిన వాళ్ళు సపోటా పండ్లను తింటే ఎనర్జీని పొందవచ్చు. అలాగే భారీ లో వేడి పెరిగినప్పుడు సపోటాలు తినడం వల్ల, వాటిలో ఉండే టాన్నిన్ అనే పదార్థం వేడిని పోగొట్టి శరీరానికి చలవనిస్తుంది.

అందుకే వీటిని తరచుగా తీసుకుంటూ ఉంటారు. మలబద్ధకం ఉన్నవారు ఈ సపోటాలను తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. సపోటాల్లో ఫైబర్, విటమిన్ బి తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా కాపాడుతాయి. అలాగే సపోటాల్లో క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్ కూడా ఉంటాయి. ఇవి ఎముకల్ని బలంగా చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. సపోటాలను తరచుగా తీసుకోవడం వల్ల ముసలి వాళ్లు అయిన తర్వాత మందులు ఎక్కువగా వాడాల్సిన పని ఉండదు. సపోటా పల్లలోని ఫోలేట్స్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్, ఫాస్ఫరస్, సెలీనియం లు ఎముకలను దృఢంగా మారేలా చేస్తాయి. సపోటా పండు తినడం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే రక్తం సరిగా లేనివారు ఈ సపోటాలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ వారు కూడా ఉదయం సమయంలో నీరసంగా ఉన్నప్పుడు ఈ సపోటాలను తినడం వల్ల అవిశక్తిని ఇస్తాయి.