Health Tips: ఈ ఒక్క పండు తింటే చాలు.. రోజంతా హుషారుగా ఉండడంతో పాటు ఆ జబ్బులన్నీ పరార్!

ఇప్పుడు చెప్పబోయే పండును తీసుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలు కలగడంతో పాటు కొన్ని రకాల జబ్బులు దూరం అవుతాయని చెబుతున్నారు. అంతే కాకుండా రోజంతా ఎనర్జిటిక్గా హుషారుగా ఉండవచ్చట.

Published By: HashtagU Telugu Desk
Health Tips

Health Tips

పండ్లలో కొన్ని రకాల పండ్లు ప్రతి రోజు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం చాలా మందికి తెలియదు. అటువంటి వాటిలో ఇప్పుడు చెప్పబోయే పని కూడా ఒకటి. తీయటి రుచి కలిగిన ఈ పండును చిన్న పిల్ల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడుతూ ఉంటారు. ఈ పండు ధర కూడా చాలా తక్కువే. ఈ పండుని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు. ఆ పండు మరేదో కాదు సపోటా. రోజు సపోటా తింటే రోగాలు దరిచేరవట. అలాగే శరీరానికి కావలసిన శక్తి కూడా లభిస్తుందట. పిల్లల నుంచి పెద్దల వరకూ ఈ పండు తినవచ్చని చెబుతున్నారు.

సపోటాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయట. ఇవి శరీరానికి రక్షణగా పని చేస్తాయని, ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయని చెబుతున్నారు. ఇకపోతే సపోటాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణం బాగా జరిగేలా చేస్తుందట. మలబద్ధకం ఉండే వారికి ఇది చాలా మంచిదని, అజీర్ణం సమస్యలు తగ్గి ఆహారం సరిగ్గా అరిగేలా సహాయపడుతుందట. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ఎంతో అవసరం. ఇవి సపోటాలో పుష్కలంగా ఉంటాయట. చర్మం తేలికగా కళ తప్పకుండా ఉండటానికి ఇవి ఉపయోగపడతాయని, చర్మం కాంతివంతంగా కనిపించేందుకు సహాయపడతాయని చెబుతున్నారు.

సపోటాలో పొటాషియం ఎక్కువగా ఉంటుందట. ఇది రక్తపోటును సమతుల్యంగా ఉంచుతుంది. బీపీ ఎక్కువగా ఉండే వారు తినడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుందట. గుండె ఆరోగ్యం బాగుండటానికి కూడా ఇది సహాయపడుతుందని చెబుతున్నారు. ఉదయాన్నే సపోటా తింటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందట. పని చేసే శక్తి కూడా పెరుగుతుందట. రోజంతా చురుకుగా ఉండేందుకు ఇది సహాయపడుతుందని, అలసట అనిపించకుండా ఉంటుందని చెబుతున్నారు. సపోటాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని, దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటాయని అధిక బరువు ఉన్నవారికి ఇది అనుకూలంగా పనిచేస్తుందని తక్కువగా తిన్నా తృప్తిగా అనిపిస్తుందని చెబుతున్నారు. ఈ పండులో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఉండటం వల్ల ఎముకలకు బలం వస్తుందట. దంతాలు గట్టిగా మారతాయట. శరీర నిర్మాణం బలంగా ఉండేందుకు ఇది సహాయపడుతుందట. వయస్సు పెరిగిన వారికీ ఇది మంచిదని చెబుతున్నారు.

  Last Updated: 13 May 2025, 04:22 PM IST