Site icon HashtagU Telugu

Ridge Gourd: బీరకాయను అవాయిడ్ చేస్తున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే?

Ridge Gourd

Ridge Gourd

మన వంటింట్లో దొరికే కూరగాయలలో బీరకాయ కూడా ఒకటి. ఈ బీరకాయను ఉపయోగించి ఎన్నో రకాల రెసిపీలు తయారు చేస్తూ ఉంటారు.. అయితే కొందరు బీరకాయను లొట్టలు వేసుకొని తింటే, మరికొందరు అసలు బీరకాయ తినడానికి ఇష్టపడరు. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి అత్యధిక నీటిశాతం కలిగిన బీరకాయను ఎండాకాలంలో తింటే చాలా మంచిది. మరి కేవలం ఇవి మాత్రమే కాకుండా ఎండాకాలంలో బీరకాయలు తినడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బీరకాయ అనేది పోషకాలతో నిండిన కూరగాయ. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, ఫోలేట్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు దాగున్నాయి. ఇవి మన శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం. బీరకాయ ముఖ్యంగా తక్కువ కేలరీలు కలిగి ఉండటంతో పాటు శక్తి వనరు. ఇది అధిక మొత్తంలో నీరు, ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది ఆహారాన్ని నిల్వ చేయడంలో సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల, బీరకాయ కూరగాయ బరువు నియంత్రణకు గొప్ప ఎంపికగా పరిగణిస్తారు. బీరకాయలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఇది తిన్న తర్వాత, సాధారణంగా గ్యాస్ లేదా అజీర్ణం గురించి ఆందోళన ఉండదు. బీరకాయలో పెద్ద మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. ఇంకా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే బీరకాయ పేగులను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. బీరకాయ పేగులను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక లక్షణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, ఫైబర్ ఉన్నాయి. ఇది పొట్టను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న బీరకాయను అవాయిడ్ చేస్తుంటే వెంటనే తినడం మొదలు పెట్టండి.

Exit mobile version