గుమ్మడి గింజలు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. చాలామంది గుమ్మడికాయను కూరలు చేయడానికి స్వీట్లు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాటి విత్తనాలను మాత్రం పడేస్తూ ఉంటారు. ఇంకొందరు వాటిని ఎండబెట్టుకొని తింటూ ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే గుమ్మడి గింజల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయట. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. మరి గుమ్మడి గింజల వల్ల కలిగే ప్రయోజనాల విషయానికొస్తే..గుమ్మడి గింజల సైజు చిన్నగా ఇవి ప్రోటీన్లకు ఇది మంచి వనరు అని చెప్పవచ్చు. ఈ విత్తనాల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, ప్రోటీన్, జింక్, ఐరన్ వంటి వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ప్రోస్టేట్ గ్రంథి ఆరోగ్యాన్ని, కొన్ని క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. అసలు గుమ్మడి గింజలు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గుమ్మడి గింజల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా కెరోటిన్, పొటాషియం, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ ఎక్కువ మొత్తంలో ఉండే గుమ్మడికాయ గింజలను తీసుకోవడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయట. అలాగే కంటిచూపు కూడా మెరుగుపడుతుందట. మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే అంటు వ్యాధులు, ఇతర సీజనల్ వ్యాధులు వస్తాయట.
అయితే గుమ్మడి గింజల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తింటే మన రోగనిరోధక శక్తి పెరుగుతుందట. గుమ్మడికాయలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వివిధ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడికాయ విత్తనాల్లో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైటోస్టెరాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయట. అంతేకాదు గుండె జబ్బుల ముప్పును కూడా తగ్గిస్తాయట. గుమ్మడికాయ విత్తనాలు ప్రోటీన్ కు మంచి మూలం. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందుతుందట. ఫైబర్ పుష్కలంగా ఉండే గుమ్మడికాయ విత్తనాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి. ఇవి గట్ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అలాగే మలబద్దకం సమస్యను కూడా తగ్గించి, అజీర్థి నుంచి కాపాడుతుందని చెబుతున్నారు. గుమ్మడి గింజల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ గింజలు డయాబెటీస్ పేషెంట్లకు మంచి మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడతాయట.