వేరుశనగల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వేరుశనగల్లో ప్రోటీన్ బాగా ఉంటుంది. మంచి కొవ్వులు, పీచు పదార్థం, విటమిన్లు, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ లాంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ మన బాడీకి కావాల్సిన పోషకాలు కాబట్టి వేరుశనగలు తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఈ విటమిన్లు,ఖనిజాలు అన్ని అందుతాయి. వీటి వల్ల మనకు మంచి ఎనర్జీ వస్తుందట. అలాగే జబ్బులతో పోరాడే శక్తి కూడా పెరుగుతుందని చెబుతున్నారు. కాగా వేరుశనగల్లో మోనోశాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి.
ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతాయట. ఈ కొవ్వుల వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందట. అలాగే గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుందని, ఇది వయో వృద్ధులకే కాక యువతకు కూడా మంచిదని చెబుతున్నారు. కాగా చలికాలంలో వేరు శనగలు తినడం ద్వారా శరీరం వెచ్చగా మారుతుందట. ఎందుకంటే వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయని, ఇలా వేడి ఉత్పత్తి కావడం వల్ల చలి నుంచి రక్షణ లభిస్తుందని,శరీరంపై చలికాల ప్రభావం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
అదేవిధంగా వేరుశనగలలో ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి బరువును నియంత్రణలో ఉంచుతాయట. అలాగే ఎక్కువసేపు ఆకలి అనిపించకుండా చేస్తాయి. దీనివల్ల తక్కువ తినవచ్చు. ఇది బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. విటమిన్ ఇ, విటమిన్ బి6, నయాసిన్, ఫోలేట్ వంటి విటమిన్లు, మెగ్నీషియం, జింక్ లాంటి ఖనిజాలు వేరుశనగలలో ఉంటాయట. ఇవి చర్మానికి మంచిగా పని చేస్తాయని, నరాలు, ఎముకలు బలపడుతాయని చెబుతున్నారు. తరచుగా పల్లీలు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చని చెబుతున్నారు. పల్లీ లను అనేక రూపాలలో తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయట.