Site icon HashtagU Telugu

Peanut: ప్రతిరోజు పల్లీలు తినడం వల్ల కలిగే లాభాలు ఇవే!

Peanuts

Peanuts

పల్లీలు.. వీటినే వేరుశెనగ విత్తనాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పల్లీల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కొందరు వీటిని వేయించుకొని తింటే మరికొందరు ఉడకబెట్టుకొని తింటూ ఉంటారు. ఇంకొందరు పచ్చిగా అలాగే తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే పల్లీలు ఎలా తిన్నా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగిస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే పల్లీలను ఉపయోగించి చాలా రకాల వంటలు తయారు చేయడంతో పాటు కొన్ని రకాల స్వీట్లు కూడా తయారు చేస్తూ ఉంటారు. పల్లిలో పల్లీల్లో ఫైబర్ కంటెంట్, ప్రోటీన్లు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.

అంతేకాదు వీటిలో ఇతర ముఖ్యమైన పోషకాలు, విటమిన్లు కూడా ఉంటాయి. వీటిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి ప్రతిరోజు పల్లీలు తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పల్లీల్లో బయోటిన్, విటమిన్ ఇ, కాపర్, మాంగనీస్, ఫోలేట్, థయామిన్, మెగ్నీషియం, ఫాస్పరస్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాగా పల్లీల్లో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయట. అందుకే వీటిని తింటే బరువు పెరుగుతారు అన్న భయం ఉండదు. పల్లీలు మీ బరువును తగ్గించడానికి కూడా సహాయపడతాయట. ఇవి గుండె సమస్యలను తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి.

పల్లీలు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని ఎలా తగ్గిస్తాయో కూడా వెల్లడించాయి. పల్లీలను మితంగా తీసుకుంటే అధిక కొవ్వు ఉన్నప్పటికీ ఇవి మీరు బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయట. పిల్లలకు పల్లీలను పౌడర్ లేదా వేరుశెనగ వెన్నగా ఇవ్వడం వల్ల అలర్జీలు వచ్చే ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు. పల్లీలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో ఎఫెక్టీవ్ గా పని చేస్తాయట. వీటిలో ఉండే ఆంటీ యాక్సిడెంట్లు శరీరం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతున్నారు. పల్లీలు తింటే చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుందట.