ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే ప్రతిరోజు ఉల్లిపాయలు తీసుకోవాలని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. కొందరు ఉల్లిపాయను కూరల రూపంలో తీసుకోవడానికి ఇష్టపడితే మరి కొందరు పచ్చిగా కూడా తింటూ ఉంటారు. ఎలా తిన్నా కూడా ఉల్లిపాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. ప్రతి ఒక్కరి వంట గదిలో ఉల్లిపాయ తప్పనిసరిగా ఉంటుంది. ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్లు, సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి.
ఇది మంటను నివారించడానికి, ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాదు ఈ ఉల్లిపాయలు గుండె జబ్బులు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. అదేవిధంగా ఉల్లిపాయలలో ఎక్కువ మొత్తంలో క్వెర్సెటిన్ ఉంటుంది. దీనిలో ఫ్లేవనాయిడల్లు, యాంటీ ఆక్సిడెంట్లు,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుందట. వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి కూరగాయలు కడుపు, పెద్దప్రేగు క్యాన్సర్లతో సహా కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయట. ఉల్లిలోని సల్ఫర్ కలిగిన సమ్మేళనం క్యాన్సర్ కణితి అభివృద్ధిని తగ్గించడానికి, అండాశయ క్యాన్సర్ పెరగకుండా చేయడానికి సహాయపడుతుందట.
ఉల్లిపాయలో ఫిసెటిన్, క్వెర్సెటిన్ కూడా ఉంటాయి. ఇవి ఫ్లేవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి కణితి పెరుగుదలను నిరోధిస్తాయని చెబుతున్నారు. ఉల్లిపాయలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని చెబుతున్నారు. డయాబెటిస్ లేదా ప్రీ డయాబెటిస్ ఉన్నవారు ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తినడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయల్లో గట్ ఆరోగ్యానికి అవసరమైన ఫైబర్, ప్రీబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రీ బయోటిక్స్ జీర్ణం కాని ఫైబర్స్. ఇవి ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియా ద్వారా విచ్ఛిన్నమవుతాయని చెబుతున్నారు.