Site icon HashtagU Telugu

Onion: ఉల్లిపాయపై నిమ్మరసం పిండుకొని తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Onion

Onion

మామూలుగా ఉల్లిపాయలను మనం ప్రతిరోజు వినియోగిస్తూనే ఉంటాం. వంటల్లో తప్పనిసరిగా ఉల్లిపాయను వినియోగిస్తూ ఉంటారు. కొంతమంది పచ్చి ఉల్లిపాయ కూడా తింటూ ఉంటారు. ఉల్లిపాయ తినడం వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఉల్లిపాయ తినడం వల్ల ఒంట్లో వేడి మొత్తం తగ్గిపోతుంది. ఇకపోతే మామూలుగా మనం బిర్యానీ వంటి మసాలా ఐటమ్స్ తినేటప్పుడు ఉల్లిపాయ పై నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటాం. కొందరు ఇలా తినడానికి అస్సలు ఇష్టపడరు.

కానీ ఇలా ఉల్లిపాయపై నిమ్మకాయ పిండుకుని తింటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.. ఎండాకాలం వేడిని తట్టుకోవడం మనకు చాలా కష్టంగా ఉంటుంది. ఈ వేడిని తట్టుకోవడానికి మనం ఉల్లిపాయ తినడం చాలా మంచిది. ఉల్లిపాయ తినడం వల్ల ఒంట్లో వేడి మొత్తం తగ్గిపోతుందట. ఉల్లిపాయలో అల్లీసిన్ ఉంటుంది. ఇది శరీరానికి మేలు చేస్తుందట. దీనిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుందని చెబుతున్నారు. ఇది మలబద్దకం నుంచి మనకు ఉపశమనం లభిస్తుందట.

బరువు తగ్గించడంలో కూడా కీలకంగా పని చేస్తుందని చెబుతున్నారు. వేసవిలో ఉల్లిపాయను సలాడ్ రూపంలో తీసుకోవాలట. ఇది మరింత ఆరోగ్యంగా ఉండానికి నిమ్మరసం, పచ్చిమిర్చి చేర్చితే సరిపోతుందని చెబుతున్నారు. ఈ నిమ్మకాయ రసం కలిపిన ఉల్లిపాయను మధ్యాహ్న భోజన సమయంలో తినాలి. ఉల్లికి నిమ్మరసం జోడించడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుందట. అలాగే పేగు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు. కాగా ఎండాకాలంలో చాలా మందికి గ్యాస్, అజీర్ణ సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి. ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఉల్లిపాయకు నిమ్మరసం కలుపుకొని తినాల్సిందే అంటున్నారు. ఉల్లిపాయలో ప్రీబయోటిక్ ఇనులిన్ ఫ్రక్టోలిగోసాకరైడ్లు కనిపిస్తాయట. నిమ్మకాయతో కలిపి తింటే అది హీట్ స్ట్రాక్ నుంచి మనల్ని కాపాడుతుందట. అలాగే అది రోగనిరోధక శక్తిని బలపరుస్తుందట. ఉల్లిపాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుందట, కాబట్టి షుగర్ పేషెంట్స్ కి కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు.