Site icon HashtagU Telugu

Banana: ప్రతీరోజు ఒక అరటిపండు తింటే ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా?

Banana

Banana

మార్కెట్ లో మనకు ఏడాది పొడవునా లభించే పండ్లలో అరటి పండ్లు మొదటి స్థానంలో ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అరటిపండు వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అరటి పండ్లను తరచుగా తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు.. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే ప్రతిరోజూ ఒక అరటిపండు తింటే అనేక లాభాలను పొందవచ్చు అని చెబుతున్నారు. మరి తరచూ అరటి పండ్లను తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. . అరటిపండ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

ఇవి మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తాయి..అరటిపండ్లలో ఫ్రక్టోజ్, కార్బోహైడ్రేట్లు, గ్లూకోజ్, సుక్రోజ్ వంటి చక్కెరలు మెండుగా ఇవి మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అరటిపండ్లలో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను నయం చేయడానికి సహాయపడుతుందట. అరటిపండ్లలో విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయట. ఇవి మన శరీరాన్ని హెల్తీగా ఉంచుతాయి. అరటిపండును తింటే రక్తపోటు పెరుగుతుందన్న భయం కూడా ఉండదట.

ఎందుకంటే ఇది రక్తపోటును నియంత్రించడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. ఈ పండులో ఉండే పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందట. ఈ పండులోని ఫైబర్ కంటెంట్ కడుపు పూతలను తగ్గించడానికి కూడా సహాయపడుతుందట. అరటి పండ్లలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం కూడా ఉంటుంది. ఇది మన ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ పండులో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని హెల్తీగా ఉంచుతాయి. అరటి పండ్లను తింటే మన మూత్రపిండాల పనితీరు కూడా మెరుగు పడుతుంది. ఎందుకంటే దీనిలో ఉండే పొటాషియం మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అలాగే ఈ పండులో ఉండే ఫైబర్ కంటెంట్ కడుపును తొందరగా నింపుతుందట. అతిగా తినడాన్ని కూడా తగ్గిస్తుందట..జీవక్రియను పెంచి మీరు హెల్తీగా బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అరటి పండ్లను తింటే ఎముకలు బలంగా అవుతాయి. దీనిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ పండ్లను తరచుగా తింటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయట. అరటిపండ్లలో విటమిన్ సి, బి6 కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సహాయపడతాయని చెబుతున్నారు.