Mango Health Benefits: రాత్రిపూట అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే మామిడి పండు తినాల్సిందే?

వేసవికాలం వచ్చింది అంటే చాలు మనకు ఎక్కడ చూసినా కూడా మామిడిపండ్లు కనిపిస్తూనే ఉంటాయి. మామిడి పండ్లలో కూడా అనేక రకాల మామిడి పండ్లు ఉన్నాయి అన్

  • Written By:
  • Publish Date - June 5, 2023 / 08:10 PM IST

వేసవికాలం వచ్చింది అంటే చాలు మనకు ఎక్కడ చూసినా కూడా మామిడిపండ్లు కనిపిస్తూనే ఉంటాయి. మామిడి పండ్లలో కూడా అనేక రకాల మామిడి పండ్లు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే మామిడి పండ్లను అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మామిడి పండ్లతో ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఎండాకాలంలో ఎదురయ్యే సమస్యలకు చక్కని పరిష్కారం మామిడి. అందుకే వేసవిలో మామిడి పండ్లు తినాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అయితే కొందరు రాత్రిపూట పలు సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.

అందులో మొదటిది నిద్రలేమి సమస్య. ఈ సమస్య కారణంగా తిన్న ఆహారం కూడా సరిగా జీర్ణం అవ్వదు. దీని వల్ల చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. వీటన్నిటికీ చక్కటి పరిష్కారం రాత్రి పూట మామిడి పండ్లు తినడం. మరి రాత్రి సమయంలో మామిడి పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామిడి పండ్లలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండి అది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. రాత్రి పూట మామిడి పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు నిద్రపోయే ముందు మామిడి పండ్లను తినడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.

మామిడిలో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి విశ్రాంతిని, నిద్రను మెరుగుపరుస్తాయి. మామిడిలో కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ అలాగే క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. రాత్రి పూట యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల మంట తగ్గుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షణ లభిస్తుంది. నిద్రపోయే ముందు మామిడి పండ్లను తినడం ద్వారా విశ్రాంతి లభిస్తుంది. దీని వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. నిద్రలేమితో బాధపడే వారు మామిడి తింటే మంచి నిద్ర పొందుతారు. మామిడి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. రాత్రి పూట మామిడి పండ్లను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి రోగాల బారిన పడకుండా ఉండొచ్చు.