Site icon HashtagU Telugu

Jowar Roti: జొన్న రొట్టె తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Jowar Roti

Jowar Roti

ఇండియాలో జొన్న రొట్టెలు ఎక్కువగా తింటారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా రాజస్థాన్ వంటి ప్రదేశాలలో ఎక్కువగా ఈ రొట్టెలనే తింటూ ఉంటారు. జొన్న రొట్టి,సద్ద రొట్టి బియ్యం రొట్టి వంటివి చేసుకొని తింటూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. నిజానికి జొన్నల్లో కంటే బియ్యంలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. మరి జొన్న రొట్టెలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే.. జొన్నల్లో విటమిన్ బి3, ఐరన్, ఫోలిక్ ఆమ్లం, కాల్షియం, పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.

జొన్న పిండిని కేవలం రొట్టెలు చేయడానికే మాత్రమే కాకుండా లడ్డూలు, అంబలి, అప్పడాలు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. జొన్నలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో కేలరీలు పెరిగే అవకాశమే ఉండదు. ఇది మన శరీరంలో శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. జొన్నల్లో ఇనుము, కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకలను బలంగా ఉంచడానికి, ఎముకల వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాదు నరాల పనితీరును మెరుగుపర్చడానికి, మొత్తం శరీర శక్తిని పెంచడానికి బాగా సహాయపడుతుందని చెబుతున్నారు. జొన్న రొట్టెలో గ్లూటెన్ ఉండదు.

ఈ రొట్టె గ్లూటెన్ సున్నితత్వం లేదా ఉదరకుహర వ్యాధి ఉన్నవారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాక జొన్నలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. గట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మలబద్దకాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. జొన్నలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బీటా గ్లూకాన్ కు జొన్నలు మంచి వరు అని చెప్పాలి. ఇది మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.

ముఖ్యంగా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఆ జొన్న రొట్టెలు తినడం వల్ల ఇవి నెమ్మదిగా జీర్ణం అవుతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు జొన్న రొట్టెలు తినడం మంచిది. ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే జొన్న రొట్టెలు మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. అంతేకాదు అనవసరంగా తినే చిరుతిండిని తగ్గిస్తాయి. ఆకలి తొందరగా కానీయదు. వీటిని తింటే మీ బెల్లీ ఫ్యాట్ కరగడంతో పాటుగా బరువు కూడా తగ్గుతారని చెబుతున్నారు..