Jaggery And Chana: వేయించిన శనగలు, బెల్లం కలిపి తినటం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఈ కాంబినేషన్ ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తుందని చెబుతున్నారు. బెల్లం, శనగలను కలిపినపుడు అది విటమిన్లు, ఖనిజాలతో నిండిన మంచి పౌష్టికాహారం అవుతుందట. కాగా వేయించిన శనగల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. బెల్లం యాంటీ యాక్సిడెంట్లతో నిండి ఉంటుంది. బెల్లంలో జింక్, సెలీనియంలు ఎక్కువగా ఉంటాయి. వేయించిన శనగలు విటమిన్ బి6, విటమిన్ సి, ఫోలేట్, నియాసిన్, థియామిన్, రిబోఫ్లేవిన్, మాంగనీస్, ఐరన్ ఇలా ఎన్నో విటమిన్స్ ఉంటాయట.
కాగా బెల్లం, వేయించిన శనగలు రెండూ జింక్ తో నిండి ఉంటాయట. ఇది శరీరంలో 300 ఎంజైమ్ లను యాక్టివేట్ చేస్తుందని, అలాగే ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఈ రెండు కలిపి తింటే చాలా మంచిదట. పడుకునే ముందు రాత్రి కొంచెం వేపిన శనగలు, బెల్లంలను పాలతో కలిపి తీసుకోవాలట. ఇది మీ ఊపిరితిత్తులను శుభ్రం చేయడానికి, కాలుష్య సంబంధిత వ్యాధుల నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుందట. బెల్లంలోని ఐరన్, శనగల్లోని ప్రోటీన్, రుతుస్రావం సమయంలో స్త్రీ రక్తం కోల్పోడానికి, తమను తాము తిరిగి శక్తివంతం చేసుకోవడానికి ఈ పోషకాలు రెండూ ముఖ్యమైనవని చెబుతున్నారు. కాగా రక్తహీనత లేదా కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు శనగలు, బెల్లం కలిపి తినాలని చెబుతున్నారు. ఎందుకంటె పప్పులో ఫైబర్ పుష్కలంగా ఉన్నప్పటికీ, ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
కాబట్టి ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల ఇది శరీరంలోని ప్రతి బలహీనతను తొలగిస్తుందట. అలాగే జీవక్రియను మెరుగుపరుస్తుందట. దీనిలో ఉన్న పొటాషియం వాళ్ళ స్ట్రోక్, గుండెపోటు వంటి కార్డియాక్ సిస్టమ్ కు సంబంధించిన సమస్యలు రాకుండా సహాయపడుతుందట. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఫుడ్ బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు. బెల్లం, శనగలు కలిపి తినడం వల్ల మీ జీవక్రియను పెంచుతుంది. ఉబకాయంతో బాధపడేవారిలో బరువు తగ్గడానికి సహాయపడుతుందట. కాగా బెల్లం వేడెక్కించే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. శనగపప్పులో ఫైబర్ ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యానికి, జీర్ణక్రియకు అద్భుతమైనది. బెల్లం, శనగ పప్పు తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట.కాగా శనగలలో ప్రోటీన్, ఫైబర్, అవసరమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, సహజ తీపి పదార్ధం అయిన బెల్లం శక్తి, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుందట. అవి కలిపినప్పుడు, రుచి, పోషకాల సమతుల్యతను సృష్టిస్తాయని చెబుతున్నారు. కాబట్టి ప్రతీ రోజు ఈ బెల్లం, శనగలు కలిపి తీసుకుంటే అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
Jaggery And Chana: బెల్లం, శనగలు కలిపి తింటే ఏం జరుగుతుందో, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?

Jaggery And Chana